Tejasajja Mirai on OTT: తేజ సజ్జా హీరోగా నటించిన మైథలాజికల్ అండ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రితికా నాయక్ హీరోయిన్గా, మంచు మనోజ్ విలన్గా నటించారు. జగపతిబాబు, శ్రియ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సెప్టెంబరు 12న విడుదలైన ఈ ‘మిరాయ్’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
జీయోహాట్స్టార్ వేదికగా అక్టోబరు 10 (Mirai Movie OTT) నుంచి మిరాయ్ సినిమా తెలుగు, కన్నడ, మల యాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. కానీ హిందీ వెర్షన్ మాత్రం జియో హాట్ స్టార్లో ఉండదు.
అశోకుని వద్ద ఉన్న తొమ్మిది దైవ గ్రంధాలను మహావీర్ (మంచు మనోజ్) సొంతం చేసుకుని, ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటాడు. కీలకమైన అమరగ్రంధం మాత్రం అంభిక (శ్రియ) దగ్గర ఉంటుంది. మరి..అంభిక కొడుకు వేదా ప్రజాపతి (తేజ సజ్జా) అమరగ్రంధంను మహావీర్కు దక్కకుండ ఎలా అడ్డుపడ్డాడు? వేదాకు ‘మిరాయ్’ ఎలా సహాయం చేసింది? అన్నదే ‘మిరాయ్’ సినిమా కథాంశం.