సినిమా: మార్గన్ (MAARGAN REVIEW)
నటీనటులు: విజయ్ ఆంటోనీ, అజయ్ ధీషన్, సముద్రఖని, బ్రిగిడా, దీప్శిక
దర్శకుడు,ఎడిటర్: లియో జాన్ పాల్ (Leo john paul)
సంగీతం, నిర్మాత : విజయ్ ఆంటోని (Vijay Antony)
కెమెరా : యువ. ఎస్
నిడివి: 2 గంటల 12 నిమిషాలు
విడుదల తేదీ : 27-0-2025 (Maargan release date)
రేటింగ్: 2.5/5
కథ
VijayAntony Maargan Review: రమ్య దారుణంగా హత్యకు గురి అవుతుంది. పైగా రమ్య శరీరం మొత్తం నల్లగా మారడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది. పోలీస్ ఆఫీసర్ ధ్రువ (విజయ్ ఆంటోని) ఈ కేసును సాల్వ్ చేయాల్సి వస్తుంది. అయితే ధ్రువ కుమార్తె కూడా రమ్య తరహాలోనే మరణించడంతో, ఈ కేసు ఎమో షనల్‌గా…చాలెంజ్‌గా తీసుకుంటారు ధ్రువ. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి, అరవింద్‌ను నిందితుడిగా అనుమానించి, అదుపులోకి తీసుకుని విచారణ స్టార్ట్ చేస్తాడు ధ్రువ. ఈ క్రమంలో అరవింద్‌లో ఉన్న పవర్‌ఫుల్ శక్తులను గురించి తెలుసుకుంటాడు. మరి…ఈ వరుస మర్డర్స్ మిస్టరీ వెనక ఉన్న వ్యక్తి అరవింద్‌నేనా? ధ్రువ అసలు హంతకుడిని ఎలా కనిపెట్టాడు? ధ్రువ కుమార్తె, రమ్యలు ఎందుకు హత్య చేయబడ్డారు? ఈ సీరియల్ కిల్లింగ్ ఎపిసోడ్‌లో శ్రుతి (బ్రిగిడా), రమ్య(దిప్శిక), వెన్నెల, మేఘనల పాత్ర ఏమిటి? అన్నది సినిమాలో చూడాలి (Maargan review).
విశ్లేషణ
సీరియల్ కిల్లింగ్, ఇన్వెస్టిగేషన్ డ్రామాలు ప్రేక్షకులకు కొత్త ఏమి కాదు. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా సాగుతుంది. ఈ ప్రాసెస్‌లోని దర్శకుడు ఆడియన్స్‌ను ఎంత వరకు ఎంగేజ్ చేయగలిగాన్నదే ముఖ్యం. సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘మార్గన్’ను ప్రేక్షకులకు ఎంగేజ్ చేయడంతో, దర్శకుడు కొంత వరకే సఫలం అయ్యాడు. ట్విస్ట్‌లు కాస్త బాగానే ఉన్నాయి. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కొంత రోటీన్ ఫీలింగ్‌ని కలిగిస్తుంది.
ఇటీవల మలయాళం నుంచి ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో హీరో అయిన పోలీస్ ఆఫీసర్ ఓ కేసును సాల్వ్ చేస్తాడు. ఈ కేసులో జరుగుతున్న మర్డర్స్ తరహాలోనే తన కుమార్తె కూడా చనిపోయింది. ఈ టెంప్లెట్ ‘మార్గన్’ సినిమాలోనూ కనిపిస్తుంది. అలాగే కొన్ని సన్ని వేశాల్లో హీరో ధ్రువను అరవింద్ క్యారెక్టర్ డామినేట్ చేసేలా ఉంటుంది. విజయ్ ఆంటోని సోదరి కొడుకు అజయ్ ధీషన్. దీంతో కథలో కావాలనే తన క్యారెక్టర్‌ను విజయ్ ఆంటోని డౌన్ చేశాడెమో అనిపిస్తుంది. అజయ్ ధీషన్‌కు ఇది తొలి సినిమా కాబట్టి, అతన్ని యాక్టర్‌గా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా విజయ్ ఆంటోని పాత్ర ప్రాముఖ్యతను కాస్త తగ్గించినట్లున్నారు. అలాగే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌కు ధ్రువ్ ఓ దశలో అరవింద్‌పై ఆధార పడటం కాస్త మైనస్‌గా అనిపిస్తుంది. అనుమానితుడి సహాయమే పోలీసాఫీసర్ తీసుకోవడం అనేది కరెక్ట్‌గా అనిపించదు. ప్రీ క్లైమాక్స్‌లో కథ ఆసక్తి కరంగా సాగుతుంది. ట్విస్ట్‌లు, టర్న్‌లు ఫర్వాలేదు. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలను ఫాలో అయ్యే ఆడియన్స్‌కు మార్గన్ పెద్ద ఆసక్తికరంగా అనిపించదు. అలా అని నిరాశపరచదు.
నటీనటుల పెర్ఫార్మెన్స్
పోలీసాఫీసర్ ధ్రువ్‌గా విజయ్ ఆంటోని బాగానే నటించాడు. ఇంటెన్స్ సీన్స్‌లో తనదైన శైలి యాక్టింగ్‌తో మెప్పించాడు. అజయ్‌ధీషన్‌కు అరవింద్ రూపంలో యాక్టింగ్‌ను చూపించే మంచి స్కోప్ దక్కింది. అజయ్ కూడా బాగానే చేశాడు. ధ్రువ్‌కు సహాయం చేసే పాత్రలో బ్రిగిడ రోల్ ఓకే. వెన్నెల, మేఘన పాత్రధారులు..తమ పాత్రల పరిధిమేరకు మెప్పించారు. సముద్రఖని రోల్ ఇలా వచ్చి, అలా వెళ్లిపోతుంది. నిర్మాణ విలువలు, సాంకేతిక విలువలు ఒకే. విజయ్ ఆంటోనీ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. నిడివి తక్కువగా ఉండటం ఈ సినిమాకు ఓ ప్లస్ పాయింట్.
ఫైనల్‌గా ! ఇన్వెస్టిగేషన్ థ్రిల్ (సగమే)