పెళ్లిలో విజయ్ – రష్మిక ధరించిన నగల విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Kumar NA

Web Stories

Would you be shocked to know the value of the jewelry worn by Vijay and Rashmika at their wedding : ఉదయ్‌పూర్ ప్యాలెస్ వేదికగా ఫిబ్రవరి 26న అత్యంత వైభవంగా జరిగిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఈ వేడుకలో వారి పెళ్లి దుస్తులతో పాటు, వారు ధరించిన ప్రత్యేకమైన ఆభరణాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి.

ముఖ్యంగా ఆ నగల వెనుక ఉన్న శ్రమ, వాటి విలువ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ ‘శ్రీ జ్యువెలర్స్’, జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. రష్మిక తన వివాహ వేడుకలో ఏకంగా 1.5 నుండి 2 కిలోల బరువైన బంగారు ఆభరణాలను ధరించారు. వడ్డాణం, మంగళసూత్రం, నెక్లెస్, జడబిళ్ల, బాసికం వంటి దాదాపు 11 రకాల డిజైన్లను ఆమె కోసం ప్రత్యేకంగా రూపొందించారు. వీటి ధర సుమారు రూ. 3 నుండి 5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ప్రముఖ డిజైనర్ అనమికా ఖన్నా రూపొందించిన ‘ఆరెంజ్ గోల్డ్’ శారీకి తగ్గట్టుగా.. దక్షిణ భారత దేవాలయ శిల్పకళ ఉట్టిపడేలా ఈ నగలను తీర్చిదిద్దారు.

పెళ్లి కొడుకు విజయ్ దేవరకొండ కూడా ఏమాత్రం తగ్గకుండా అచ్చం రాజులా మెరిసిపోయారు. ఆయన సుమారు అరకిలో (500 గ్రాములు) బరువైన సంప్రదాయ ఆభరణాలను ధరించారు. వీటి విలువ సుమారు కోటి రూపాయలు నుండి 2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇందులో వాడిన అరుదైన వజ్రాలు, ముడిసరుకు ఈ నగలకు అంతటి విలువను తీసుకొచ్చాయి. ఈ ఆభరణాలు అప్పటికప్పుడు కొన్నవి కావు. వీటి వెనుక దాదాపు 10 నెలల నిరంతర శ్రమ దాగి ఉంది. “మాకు తాత్కాలికంగా ట్రెండీగా ఉండే డిజైన్లు వద్దు.. తరతరాలుగా గుర్తుండిపోయేలా మన సంప్రదాయం ఉట్టిపడాలి” అని ఈ జంట ఏడాది ముందే జ్యువెలరీ టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. అందుకే ప్రతి నగను ఒక కళాఖండంలా అత్యంత జాగ్రత్తగా చెక్కారు. సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ, రాయల్ లుక్‌ను కోరుకున్న ఈ జంట వెడ్డింగ్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.

Please Share
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi