71th National FIlm Awards: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ( (Droupadi Murmu) 71వ జాతీయ సినీ అవార్డుల (71th National Cinema Awards) విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ వేడుక న్యూ ఢిల్లీలో జరిగింది. 2023 సంవత్సరానికి గానూ, ఈ సినీ అవార్డులను ప్రదానం చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఓ పరిశ్రమ మాత్రమే కాదని, సమాజాన్ని, దేశాన్ని మేల్కొల్పే శక్తిమంతమైన సాధనం సినిమా అని ద్రౌపది ముర్ము అన్నారు. సినిమాకు మంచి ప్రేక్షకాదారణ లభించడం మంచి విషయమే అయినప్పటికీని, ఆ సినిమా ముఖ్య ఉద్దేశం ప్రజాప్రయోజానర్థమై ఉండాలని, ముఖ్యం నేటి యువతరానికి ఉపయుక్తంగా ఉండేలా ఉండా లని ముర్ము అన్నారు. అలాగే సినిమా రంగంలో మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని, అవార్డుల ప్రాంతీయ, కేంద్ర, ప్యానెల్‌లలో మహిళల ప్రాతినిధ్యం కూడా ఉండాలని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని తాను కలలో కూడా ఊహించలేదని, ఏదో మ్యూజిక్ జరిగిపోయిన్లుగా జరిగిందని, సినిమా తన హాట్బిట్ అని మోహన్‌లాల్ చెప్పారు.

ఇక ఈ 71వ జాతీయ సినీ అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును హిందీ నటుడు షారుక్‌ఖాన్, విక్రాంత్ మెస్సె అందుకున్నారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ, ఉత్తమ చిత్రం దర్శకుడు విధు వినోద్ చోప్రాలు అవార్డులు అందుకున్నారు. ఇక తెలుగు సినిమా నుంచి ఉత్తమ జాతీయ పాట (ఊరు పల్లెటూరు…బలగం సినిమా) రాసిన కాసర్లశ్యామ్, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమా వీఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కుమార్, బేబీకి స్క్రీన్ ప్లే అందించిన సాయి రాజేష్, గాయకుడు రోహిత్, దర్శకుడు అనిల్‌రావిపూడి, నిర్మాత సాహుగారపాటి, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్థన్ రామేశ్వర్ వంటి తెలుగు వారికి అవార్డులు వచ్చాయి. ఇక ఎంతో ప్రతిష్టా త్మకమైన దాదా సాహెబ్‌ఫాల్కే పురస్కారాన్ని మలయాళ నటుడు మోహన్‌లాల్ అందుకున్నా రు.