మనశంకరవరప్రసాదుగారు ఏ రోజు వస్తారంటే..!

Viswa

Web Stories

Mana Shankara Vara Prasad Garu Release : చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘మన శంకర వరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu )సినిమా చిత్రీకరణ పూర్తయింది. అనిల్‌ రావిపూడి (Director AnilRavipudi) దర్శకత్వంలో చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల, సాహు గార పాటి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా, వీటీవీ గణేష్, క్యాథీరన్, వెంకటేశ్‌లుఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ శనివారం మేకర్స్‌ ఓ ప్రెస్‌మీట్‌ని నిర్వహించి, ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జవనరి 12న రిలీజ్‌ చేస్తున్నట్లుగా రిలీజ్‌డేట్‌ను అధికా రికంగా ప్రకటించారు.

అలాగే డిసెంబరు 12న వెంకటేశ్‌ బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమాలోని వెంకటేశ్‌ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

Mana Shankara Vara Prasad Garu Movie Venkatesh Look

ఇక మనశంకరప్రసాద్‌గారు సినిమాలో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ శంకరప్రసాదుగా చిరంజీవి, శశి రేఖ పాత్రలో నయనతార నటించారు. వెంకటేశ్‌ ఓ ముఖ్య పాత్రలో నటించారు. చిరంజీవి, వెంకటేశ్‌ కాంబినేషన్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఉందని తెలిసింది. ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

ఈ సంక్రాంతి పండక్కి, ‘మనశంకరవరప్రసాదుగారు’ సినిమాతో పాటుగా, జనవరి 9న ప్రభాస్‌ ‘రాజాసాబ్‌’ జనవరి 14న శర్వానంద్‌ ‘నారి నారి నడుమ మురారి’ సినిమా, నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’, జనవరి 13న రవితేజ ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’, సంక్రాం తికి విడుదల అవుతున్నాయి. తమిళ హీరో విజయ్‌ ‘జననాయకుడు’, శివ కార్తీకేయన్‌ ‘పరాశక్తి’ చిత్రాలూ కూడ ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో రిలీజ్‌ కానున్నాయి.

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Manasa Varanasi Shivani Nagaram Heroine Nabanatesh Latest Pics Krithishetty Ritika Nayak