యూట్యూబర్‌గా కొద్దిమందికే తెలిసిన మౌళి తనూజ్ ప్రశాంత్..లిటిల్‌హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. తొలి సినిమానే రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచింది. తొలి సినిమానే కలెక్షన్స్ పరంగా బ్లాక్‌బస్టర్ కావడంతో కొంతమంది లక్ అన్నారు. మరికొందరు హార్డ్‌వర్క్ అన్నారు. ఇప్పుడు ఈ మౌళి తనూజ్ యాక్ట్ చేసిన రెండో సినిమా ‘డీఎన్‌కే’ రిలీజ్ అయ్యింది. మరి…ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో చదివేద్దాం.1
| సినిమా | డీఎన్‌కే |
| ప్రధాన నటీనటులు | మౌళి తనూజ్ ప్రశాంత్, సుష్మిత శెట్టి, అలీ, రజిత, రఘుబాబు, ప్రియా, గుండు సుదర్శన్ |
| దర్శకత్వం | శ్రీను కంబాల |
| నిర్మాతలు | నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ |
| సంగీతం | సింజిత్ యెర్రమిల్లి |
| కెమెరా | సూర్య బాలాజీ |
| ఎడిటింగ్ | శ్రీధర్ సోంపల్లి |
| విడుదల తేదీ | 13-11-2026 |
| నిడివి | 2 గంటల 11 నిమిషాలు |
| సెన్సార్ | యూ బై ఏ (16 ఫ్లస్) |
| రేటింగ్ | 1.75/5 |
కథ
ఆన్లైన్ బెట్టింగ్‌కి బానిసైన ఈశ్వర్ (మౌళి తనూజ్ ప్రశాంత్) లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకుంటాడు. ఇవి పొగొట్టడంతో పాటుగా, ఇంట్లో తల్లీదండ్రులకు తెలియకుండ డబ్బులు దొంగతనం చేస్తుంటాడు. అలాగే తన ప్రేయసి దీపు దగ్గర దాదాపు పది లక్షల రూపాయాలు తీసుకుని, పొగొడతాడు. ఈ విషయం దీపు తల్లిదండ్రులకు తెలిసి ఈశ్వర్‌ను నిలదీస్తారు. నెలలో పది లక్షల రూపాయాలు కట్టాల్సిందే అని డెడ్ లైన్ పెడతారు. ఇక చేసేది ఏం లేక, డబ్బుల కోసం ఓ గోల్డ్ షాప్‌లో భారీ రాబరీ చేయాలని ఈశ్వర్ ప్లాన్ చేస్తాడు. తన కూడా ఉన్న వ్యక్తితో కలిసి ఈశ్వర్ నైట్ గోల్డ్షాప్కి దొంగతనాకి వెళ్లగానే, వీళ్ల కంటే ముందే గోల్డ్ షాప్‌ను మరొకరు రాబరీ చేస్తారు. మరి..ఈశ్వర్ ప్లాన్ ఎలా బోల్తా కొట్టింది? గోల్డ్‌షాప్ ఓనర్ తన షాపులో దొంగతనం చేయబడిన నగలను తానే ఎందుకు వెతుక్కోవాల్సి వచ్చింది? మరి..ఈ విషయంలో పోలీసులు ఏం చేశారు? దీపు తండ్రి పుల్లయ్యని చంపింది ఎవరు? అన్నది సినిమాలో చూడాలి.
విశ్లేషణ
‘లిటిల్‌హార్ట్స్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత మౌళి తనూజ్ తీసిన ఈ ‘డీఎన్‌కే’ మూవీపై కాస్త అంచ నాలు ఉన్నాయి. పైగా మైత్రీవంటి ప్రముఖ బ్యానర్ ఈ సినిమాను నిర్మించడంతో ఈ అంచనాలకు తగ్గ బలం చేకూరింది. కానీ ఈ బలం ‘డీఎన్‌కే’ సినిమా కథలో ఏ మాత్రం లేదు. కొంత క్రింజ్ కామెడీ, బలవంతపు కామెడీ, ఒకట్రెండు డబుల్‌మీనింగ్ డైలాగ్స్, రోటీన్ స్టోరీతో ‘డీఎన్‌కే’ చిత్రం ఆడియన్స్‌ను నిరాశపరిచేలా ఉంటుంది. జయకృష్ణ ట్రాక్‌తో సినిమాకు ఏదో కొత్తకలరింగ్ ఇద్దామని ట్రై చేసిన అటెంమ్ట్ కూడా వర్కైట్ కాని పరిస్థితి.

కథను అక్కడక్కడే తిప్పాడు దర్శకుడు. మధ్యలో వచ్చే ట్విస్ట్‌లు ఒకే అనిపిం చినా, వీటిని జస్టిఫై చేసే డ్రామా సినిమాలో లేదు. జెన్‌జీ ఆడియన్స్‌కు నచ్చే వన్‌లైనర్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేవు. రెండున్నర గంటలు ఆడియన్స్ థియేటర్స్‌లో కూర్చుంటే అసలైన జోక్స్ వచ్చే సన్నివేశాలు వేళ్లపై లెక్కపెట్టవచ్చు. ఒక బ్యాగ్ చుట్టు తిరగే సీక్వెన్స్ అంతా దర్శకుడు ఇంకాస్త అప్డేట్ కావాల్సి ఉం దన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇక హీరోకు ఓ టైమ్బాంబ్ ఫిక్స్ చేసి, 24 గంటల డెడ్‌లైన్ అని పోలీసులే ఓ టార్గెట్‌ను పెట్టడం, హీరో ఆ బెల్ట్బాంబ్తో నగలదొంగను పట్టుకోవాలని చేసే ప్రయత్నం ఏమాత్రం ఆసక్తిగా అనిపించవు. వీటికి తోడు హీరో బీఎమ్‌డబ్యూ›్ల బిల్డప్ షాట్స్ ఎక్స్ట్రా బర్డెన్ ఆడి యన్స్‌కు.
నటీనటులు పెర్ఫార్మెన్స్
మౌళి యాక్టింగ్ ఒకే. ‘లిటిల్‌హార్ట్స్’లో కంటే యాక్టర్‌గా ఏం మారలేదు. హీరోయిన్ సుష్మితాశెట్టి రోల్‌కు ఇంపార్టెన్స్ లేదు. రఘుబాబు పాత్రలో వచ్చే ట్విస్ట్స్లు బాగున్నా, ఈ పాత్ర స్క్రీన్‌పై ఎక్కువ సేపు కని పించదు. హీరో తండ్రిగా అలీ, హీరో తల్లిగా రజిత వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు.జయకృష్ణ ఉన్నంతలో ఏదో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. క్రైమ్కామెడీ కథలను రాయడం సులభమే. కానీ ఆడి యన్స్ ఎంగేజ్ అయేలా రాయడమే కష్టం. దర్శకుడు శ్రీను ఈ విషయంలో కాస్త అనుభవం కావాలి. కథలో కొత్తదనం లేదు. కేవలం ట్విస్ట్‌లపై సినిమా వర్కైట్ అవ్వదు. క్రైమ్ కామెడీ అన్నప్పుడు క్రైమ్ మాత్రమే సరైన కామెడీ ఉండాలి. ఈ విషయంలో శ్రీను దర్శకుడిగా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. సంగీతం, ఎడిటింగ్, కెమెరా వర్క్ సో సోగా ఉన్నాయి. నిర్మాణ విలువలు బడ్జెట్‌కు తగ్గట్లు ఒకే.
బాటమ్‌లైన్: ఓల్డ్ క్రైమ్..పిచ్చి కామెడీ