Dharman Movie:రజనీకాంత్ గత సినిమాల్లో ఇతర భాషల స్టార్ హీరోలు కూడా భాగం కావడం స్పష్టంగా కనిపిస్తోంది. రజనీకాంత్ ‘జైలర్’, ‘జైలర్ 2’ సినిమాల్లో ఎంతమంది స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేశారో మనకు తెలిసిందే. ఇక రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘ధర్మన్’ (Dharman Movie) సినిమా విషయానికి వస్తే…ఇది కాస్త డిఫరెంట్.. ఎందు కంటే.. ‘జైలర్’, ‘జైలర్ 2’ సినిమాల్లో ఇతరభాషల స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ చేస్తుంటే…‘ధర్మన్ (Rajinikanth Dharman Movie)’ చిత్రంలో మాత్రం ఎక్కుమంది హీరోయిన్స్ నటిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, సిమ్రాన్, శ్రీలీల, రాశీ ఖన్నా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విలన్‌గా రామ్?
ఇక ‘ధర్మన్’ సినిమాతో హీరో రామ్ (Hero Ram) కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో రామ్ చేయనున్నది విలన్ రోల్ అని తెలిసింది. ఇటీవల మైసూర్లో జరిగిన ‘ధర్మన్’ సినిమా షూటింగ్లో రజనీకాంత్, రామ్, రాశీ ఖన్నా పాల్గొనగా, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇందులో రామ్–రాశీఖన్నా జోడీగా కనిపిస్తారని తెలిసింది. ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
రామాయణం మూవీ రివ్యూ అండ్ రేటింగ్
తెలుగు హీరోనే విలన్నా?
రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున విలన్ రోల్ చేశారు. ఈ సినిమా కంటే ముందు రజనీకాంత్ హీరోగా చేసిన ‘వేట్టయాన్’ మూవీలో తెలుగు హీరో రానా విలన్‌గా యాక్ట్ చేశారు. ఇప్పుడు రజనీకాంత్ లేటెస్ట్ మూవీ ‘ధర్మన్’లో రామ్ విలన్‌గా చేస్తున్నారు. ఇలా..సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలో విలన్ అంటే తెలుగుహీరోనే అన్నట్లు ఉంది.
సంక్రాంతికి వస్తుందా?
ధర్మన్ సినిమాను కమల్‌హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించినప్పుడు ఈ సినిమాను 2027 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి…‘ధర్మన్’ సినిమా వచ్చే సంక్రాంతికే థియేటర్స్‌కు వస్తుందా? లేదా? అన్నది చూడాలి. మరోవైపు కోలీవుడ్‌లో ‘ధర్మన్’తో పాటుగా ‘వెట్టువం’, ‘డిమాంట్ కాలనీ’…వంటి మరో ఐదు సినిమాలు పొంగల్‌కి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.