లవ్‌…వెయ్యికోట్ల రూపాయల డీల్‌!

PR
PR
1 Min Read

Web Stories

Itllu Arjuna Trailer: కొత్త కుర్రాడు అనీష్‌ (Aniesh) హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna Movie). హీరోయిన్‌గా అనస్వర రాజన్‌ (Anaswara Rajan) సైన్‌ చేసిన తొలి సినిమా ఇది. నాగార్జున సమర్పణలో దర్శకుడు వెంకీ అట్లూరి నిర్మించిన తొలి సినిమా ఇది. అక్టోబరు 30నే విడుదల కావాల్సిన ఈ సినిమా నవంబరు 13న (Itllu Arjuna Movie Trailer) విడుదల అవుతుంది. రిలీజ్‌ డేట్‌ సమీపిస్తున్న తరుణంలో ఈ మూవీ ట్రైలర్‌ను హీరో ఎన్టీఆర్‌ చేసి, చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

మరో సినిమా కథ..ఈ సారైనా హిట్‌ అవుతుందా?

మూగవాడైన అర్జున్‌ ప్రేమలో పడతాడు. కీర్తీని ఇష్టపడతాడు. కానీ తన ప్రేమను వ్యక్తం చేసేందుకు భయ పడుతుంటాడు. కీర్తీ తనకి దగ్గరైనా కూడా తన మనసులోని మాటను చెప్పడానికి తడబడుతుంటాడు. ఈ క్రమంలో అర్జున్, కీర్తీ ఓ క్రైమ్‌లో చిక్కుకుంటాడు. వందకోట్ల రూపాయలతో లింక్‌ అయిన ఓ పెన్‌ డ్రైవ్‌ మిస్సింగ్‌లో అర్జున్‌–కీర్తీల భాగస్వామ్యం కూడా ఉంటుంది. ఈ తర్వాత ఏమైంది? అన్నదే ఈ సినిమా మెయిన్‌ స్టోరీ. మహేశ్‌ ఉప్పల ఈ సినిమాకు దర్శకుడు.

ఇక వెయ్యికోట్ల రూపాయల లాకర్, ఓ పెన్‌ డ్రైవ్‌…ఈ రెండు అంశాల లింకప్‌తో ఇటీవలే సందీప్‌కిషన్‌ చేసిన ‘సిగ్మా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆడలేదు. మరి..‘ఇట్లు అర్జున’ సినిమా ట్రైలర్, తమన్‌ మ్యూజిక్, మూగవాడి ప్రేమ…వంటి అంశాలతో కొత్తగా కనిపిస్తోంది. మరి.. సినిమా ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుంటుదన్నది చూడాలి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah