RC17 Movie:‘రంగస్థలం’ (2018)…హీరో రామ్‌చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లోని సూపర్‌హిట్ సినిమా ఇది. మళ్లీ ఆరేళ్ల తర్వాత రామ్‌చరణ్–సుకుమార్ కాంబోలో మరో మూవీ రాబోతుంది. 2024లో రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా (మార్చి 27) మార్చి 25న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. రామ్‌చరణ్ కెరీర్ లోని ఈ పదిహేడో సినిమా ‘ఆర్సీ 17’ (వర్కింగ్ టైటిల్)తో ఈ నవంబరు 1న పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
‘ఆర్సీ 17’ సినిమా ఓపెనింగ్ ఒక ఎత్తు అయితే. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను అందరి దృష్టిని ఆకర్షిం చింది. ఈ సినిమా ఓ మైథాలజీ డ్రామా అని, ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుందని, ఇందులో రామ్‌చరణ్ శ్రీకృష్ణుడుగా నటిస్తారని..ఇలా ఎవరు ఊహిలకు తగ్గట్లు వాళ్లు ఊహించు కుంటున్నారు. ఒక్క కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ సినిమాపై ఇండస్ట్రీలో బజ్, అభిమానుల్లో పాజిటివిటీ నింపేశారు దర్శకుడు సుకుమార్. అయితే ‘ఆర్సీ 17’ సినిమాను 2028లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది.
రామాయణం రిలీజ్…కాజల్ మౌనం వెనుక కారణం ఏంటి?
అసలు సవాళ్లు ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే…2027లో టాలీవుడ్ టాప్‌స్టార్స్ ప్రభాస్ నుంచి ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ఎన్టీఆర్ నుంచి ‘డ్రాగన్’, అల్లు అర్జున్ ‘రాకా’, మరీ ముఖ్యంగా మహేశ్‌బాబు ‘వారణాసి’ సినిమాలు రాబోతున్నాయి. ఈ చిత్రాలన్నింటిపైన ఆల్రెడీ ఆడియన్స్‌లో బజ్ నెలకొంది. ఇప్పుడు ఈ సినిమాలను మించిన లేదా అదే స్థాయి బజ్‌ను, సినిమా రిజల్ట్‌ను సుకుమార్ ఈ ‘ఆర్సీ 17’ సినిమాతో సాధించాల్సి ఉంటుంది. సుకు మార్ ముందు రాబోతున్న అసలు సవాలు ఇదే. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సిని మాలతో బాక్సాఫీస్ వండర్స్ క్రియేట్ చేసిన సుకుమార్ ‘ఆర్సీ 17’తో ఏ మ్యాజిక్ చేయబోతున్నారో చూడాలి. మరోవైపు రామ్‌చరణ్ హీరోగా చేసిన గత చిత్రాలు ‘గేమ్‌చేంజర్’ ఫ్లాప్‌గా మిగలవగా, ‘పెద్ది’ సినిమా ఓ మోస్తారు హిట్‌గా నిలిచింది. ఈ తరుణంలో రామ్‌చరణ్ కెరీర్‌కు ఓ బిగ్ హిట్ మూవీ కావాలి. అది ‘ఆర్సీ 17’తోనే లభించాలని మెగాఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Раджу сайт: https://kassetaua.com/ – очень удобно пользоваться. [dzij]