వారణాసి…రుద్ర చేసే కాలాతీత ప్రయాణం

Viswa
2 Min Read

Web Stories

Maheshbabu new look from varanasi: మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వారణాసి’ సినిమా (Varanasi cinema) చిత్రీకరణ తుది దశకు చేరుకుంటుంది. ఇప్పటికే 85 శాతానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో రుద్ర, శ్రీ రాముడు..ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు మహేశ్‌బాబు. ఇంకా మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌ నటి స్తున్నారు. కాగా, ఆగస్టు 9న మహేశ్‌బాబు బర్త్‌ డే (Maheshbabu Birthday). ఈ సందర్భంగా ‘వారణాసి’ సినిమా నుంచి మహేశ్‌బాబుకు చెందిన రెండు కొత్త స్టిల్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

ఇక ఈ స్టిల్స్‌ గురించి..రాజమౌళి (Director SSRajamouli) ప్రత్యేకంగా మాట్లాడారు. ఆఫ్రికా లొకేషన్స్‌లో వారణాసి సినిమా చిత్రీ కరణ జరుగుతున్న సమయంలో తీసిన ఫోటోలు ఇవేనని తెలిపారు. అలాగే కిలిమంజారో, మసాయి మారా లోకేషన్స్‌లో ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ జరిగినప్పుడు, ఆ రోజుటి ఉదయాల్లో తమ కళ్ల ముందు ఉన్న విజువల్స్‌ను ఐమాక్స్‌ కెమెరాల్లోని 1 43 1 ఫేమ్స్‌ కూడా చిత్రీకరణలో కూడా ఇమడలేనంత గొప్పగా ఉన్నాయని రాజమౌళి చెప్పారు.

Maheshbabu new Look 78
Maheshbabu new Look 78

ఇంకా మహేశ్‌బాబు రుద్ర పాత్ర, మహేశ్‌బాబు పెర్ఫార్మెన్స్‌ను గురించి ప్రత్యేకంగా మాట్లాడారు రాజమౌళి. రుద్ర తనకంటే గొప్పదైన, పెద్దదైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి జన్మించాడని, అతను కోరుకోని విధిని అతను మోస్తున్నాడని అన్నారు. రుద్ర చాలా చమత్కారుడు. సున్నితమంతుడు. అలాగే ఉగ్రరూపం దాల్చగలడు అని రుద్ర పాత్ర తాలుకూ లక్షణాలను సుస్పష్టంగా తెలిపారు రాజమౌళి.

ఇక మహేశ్‌బాబును గురించి మాట్లాడుతూ–‘‘వెండితెరపై ఉగ్రరూపాన్ని ఎవరైనా ప్రదర్శించగలరని, కాకపోతే ఉగ్రరూపాన్ని, ఆ వెంటనే శాతంతో కూడిన రూపాన్ని మాత్రం చూపించగలిగే నటులు కొందరే ఉన్నారని, వారిలో మహేశ్‌బాబు ఒకరని రాజమౌళి కొనియాడారు.

కాలాతీతంగా శతాబ్దాలు దాటి ప్రపంచాన్ని చుట్టేసే ఓ సాహసికుడి ప్రయాణం నేపథ్యంతో ‘వారణాసి’ సినిమా కథనం సాగుతుందని తెలుస్తోంది.

కేఎల్‌. నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ నిర్మిస్తున్న ‘వారణాసి’ సినిమా 2027 ఏప్రిల్‌ 7న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu