Raghava Lawrence MahaveerKarna Movie Announcement: భారతీయ ఇతిహాసం ‘మహాభారతం’ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. ముఖ్యంగా మహా భారతం లో ఎంతో కీలకమైన ‘కర్ణుడి’ నేపథ్యంతోనే ఎక్కువ సినిమాలు ఉన్నాయి. తాజాగా కర్ణుడి బ్యాక్‌డ్రాప్‌తో మరో సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. రమేష్ వర్మ దర్శకత్వంలో మహావీర్ కర్ణ (MahaveerKarna Movie) అనే సినిమా ప్రకటన వచ్చింది. ఈచిత్రంలో కర్ణుడిగా రాఘవలారెన్స్ (Raghava Lawrence As Karna)నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి, ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
జయంతిలాల్‌గడ సమర్పణలో ఆర్వీ స్టూడియోస్, శ్రీనీలాద్రి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మహావీర్ కర్ణ సిని మాను దాదాపు రూ. 150 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు మేకర్స్. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ ‘మహావీర్‌కర్ణ’ సినిమా రిలీజ్ కానుంది.