‘ఛాంపియన్’ సినిమాతో గత ఏడాది హీరోయిన్గా పరిచయం అయిన యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ నటించిన తాజా సినిమా ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాత. ఈ సినిమాను నాగార్జున సమర్పిస్తుండటం విశేషం. ‘ఇట్లు అర్జున’ సినిమా నవం బరు 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా అనస్వరరాజన్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు.
అనస్వర రాజన్ తెలుగులో సైన్ చేసిన తొలి సినిమా ‘ఇట్లు అర్జున’. కానీ ‘చాంపియన్’ సినిమా ముందుగా విడులైంది.
‘ఇట్లు అర్జున’ సినిమాలో కీర్తీ పాత్రలో అనస్వరరాజన్, అర్జున్ పాత్రలో అనీష్ యాక్ట్ చేశారు. కీర్తీ-అర్జున్‌ల ప్రేమకథే ఈ సినిమా. ఈ సినిమాలో మూగవాడైన అర్జున్ పాత్రలో అనీష్ యాక్ట్ చేయడం విశేషం.
అనస్వర రాజన్ చేతిపై ఓ ట్యాటూ ఉంటుంది. ఈ ట్యాటూకు ఒక ప్రత్యేకత ఉంది. తాను పెంచుకుంటున్న పెంపుడు పిల్లి పేరు అది. ఇదే ట్యాటూ ఆమె సోదరి చేతిపై కూడా ఉంటుందని అనస్వర చెప్పారు.
మలయాళ నటి అనస్వరరాజన్కు తెలుగు హీరో అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్‌కు అనస్వర విరాభిమాని.
ప్రస్తుతం చిరంజీవి ‘కాకా’, రవితేజ ‘తులాభారం’, సంగీత్శోభన్ ‘అంతా రాములోరు చుస్కూంటారు’ సినిమాల్లో నటిస్తున్నారు అనస్వర రాజన్.
కాకా సినిమా వచ్చే సంక్రాంతికి, ‘అంతా రాములోరు చుస్కూంటారు’ సినిమా ఫిబ్రవరిలో, ‘తులాభారం’ సినిమా వేసవిలో రిలీజ్ కానున్నాయి.