సమ్మర్‌ హాలీడేస్‌ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Kumar NA
3 Min Read

Web Stories

SummerHolidays Movie Review: రీసెంట్‌ టైమ్స్‌లో ఎక్కువగా పాన్‌ ఇండియా సినిమాలు, భారీ యాక్షన్‌ సినిమాలు, రక్తపాతంతో కూడిన సిని మాలే ప్రేక్షకుల ముందుకు వస్తు న్నాయి. చిల్డ్రన్స్‌ లీడ్‌ రోల్స్‌లో నటించిన సినిమాలు రావడం తక్కువ అయిపోయింది. ఇలాంటి తరుణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సమ్మర్‌ హాలీడేస్‌’ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి విభిన్నమైన అనుభూతిని ఇచ్చింది? ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? అన్నది రివ్యూలో చదివేద్దాం (SummerHolidays Movie Review).

కథ

సిటీలో చదువుకుంటున్న కుర్రాడు ఆర్వీ (అరుణ్‌దేవ్‌). క్రికెట్‌ అంటే ఇష్టం. ఈ విషయం ధైర్యంగా తండ్రికి చెప్పలేక సతమతమవుతూ, తండ్రి (హర్షవర్ధన్‌) పెట్టే ర్యాంకింగ్‌ ప్రెజర్‌తో బాధపడుతుంటాడు. సమ్మర్‌ హాలీడేస్‌లో అమ్మ (వాసుకి)తో కలిసి అమ్మమ్మ (జయసుధ) ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆర్‌వీకి కేవీ (రోహన్‌ రాయ్‌) పరిచయం అవుతాడు. పైకి సంతోషంగా ఉన్నా కేవీ చుట్టు ఆర్థిక సమస్యలే అల్లుకుని ఉంటాయి. తన తల్లికి ఓ కొత్త చీర కొనిపెట్టాలన్నది కేవీ ఆకాంక్ష. చదువుకుంటునూ ఉదయాన్నే ఇంటి ఇంటికి న్యూస్‌ పేపర్స్‌ వేస్తుంటాడు. ఈ పనితో పాటుగా తండ్రి చేసిన అప్పును తీర్చేందుకు ఊర్లోని వర్మ (రాజీవ్‌ కనకాల) మామిడితోట లోని కొన్ని చెట్లను లీజుకు తీసుకుని పనిచేస్తుంటాడు. మరి..భిన్న ప్రపంచాలు ఉన్న ఆర్వీ, కేవీలు స్నేహం సమ్మర్‌హాలీడేస్‌లో మొదలైన తర్వాత, వీరి జీవితంలో కలిగిన మార్పులు ఏమిటి? కేవీని చూసి ఆర్వీ ఏం నేర్చుకున్నాడు? ఇంతకీ సుమతి (ఖుషి) ఎవరు? అన్న విషయాలను సినిమాలో చూడాలి (SummerHolidaysReview).

కథనం

2001లో సమయంలో ఈ సినిమా కథనం సాగుతుంది. సెల్‌ఫోన్‌ ఇంటర్‌నెట్, సోషల్‌మీడియా లేని కాలంలో బాల్య జీవితం ఎంత అందంగా ఉంటుందో ఈ సినిమాలో కనిపిస్తుంటుంది. తరగతి గదిలో చెప్పె మాటలు కన్నా, అమ్మమ్మ ఇంట్లో నేర్చుకునే పాఠాలు జీవితానికి ఎంత ఉపయోగపడతాయో ఈ సినిమా మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేస్తుంది.

ఈ సినిమా కేవలం ఎర్లీ 2000 నాటి జ్ఞాపకాలను మాత్రమే కాదు..స్నేహం విలువ, కష్టపడి కలలను నిజం చేసుకోవాలనే తపనను మేల్కోల్పేలా ఉంటుంది. జీవితం అంటే కేవలం మార్కులే కాదని, ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని పోరాడి గెలవడమే జీవితం అని ఈ సినిమా చాటి చెబుతుంది. ఆర్వీ పుట్టినరోజు వేడుకలు అమ్మమ్మ ఇంట్లో జరగడం, కేవీ పండించిన పంటను మార్కెట్‌కు తరలించడం, కేవీ తన తల్లికి చీరకొనే సన్నివేశాలు ఈ సినిమాలో భావోద్వేగ భరితంగా ఉంటాయి. ఆర్వీ–కేవీల స్నేహం సరదాగా ఉంటుంది. పతాక సన్నివేశాలు సందేశాత్మకంగా ఉంటాయి. సమ్మర్‌ హాలీడేస్‌ ముగిసిన తర్వాత ఆర్వీలో కనిపించే మార్పు, తన తండ్రితో ఆర్వీ పలికే సంభాషణలు ఈ సినిమాలో మేజర్‌ హైలైట్‌గా ఉంటాయి. కాస్త నెమ్మదిగా సాగే కథనం, ఊహకు అందే సన్నివేశాలు ఆడియన్స్‌కు కాస్త ఇబ్బందిగా అనిపించిన కథలోని భావోద్వేగాలు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.

నటీనటులు ఎవరు ఎలా చేశారు?

ఆర్వీగా అరుణ్‌దేవ్ (Arun), కేవీగా రోహన్‌రాయ్‌ (Rohan) మంచి పాత్రల్లో నటించారు. స్నేహం, ఎమోషన్, సరదా, అమా యకత్వం..ఇలాంటి అన్ని సన్నివేశాల్లోనూ ఈ ఇద్దరు మంచి నటన కనబరచారు. బేబీ ఖుషి పాత్రకు మేజర్‌గా గుర్తింపు లేకపోయిన తన పాత్రతో గుర్తుండిపోతుంది. తల్లి పాత్రల్లో హర్షణి, వాసుకీ మంచి రోల్స్‌ చేశారు. ఇక అమ్మమ్మ పాత్రలో జయసుధ ఈ సినిమాకు మరో మేజర్‌ ఎస్సెట్‌. హర్షవర్ధన్, రాజీవ్‌ కనకాల ఇంపాక్ట్‌పుల్‌ రోల్స్‌ చేశారు. దర్శకుడు శ్రీకర్‌ నయన్‌ (Director Srikar Nayan G) కు ఇదే తొలి సినిమా అయినప్పటికీని, చాలా క్లారిటీతో ఈ సినిమాను తీసినట్లు స్పష్టం అవుతోంది. నిర్మాతలు ధీరజ్‌ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మాణ విలువలు బాగున్నాయి. సాయిప్రకాష్‌ కెమెరా వర్క్, సింజిత్‌ యెర్రమల్లి సంగీతం ఒకే.

చివరిగా..: గుర్తుండిపోయే సమ్మర్‌ హాలీడేస్‌

రేటింగ్‌ 2.75/5

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah