రామాయణం మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Viswa
5 Min Read

Web Stories

Ramayanam Review: భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. ఇంకా వస్తునే ఉన్నాయి. భవిష్యత్‌లో కూడా వస్తాయి. కానీ ఎప్పుడొచ్చినా సరే..‘రామాయణం’ కథను తమ నరేటివ్‌తో దర్శకుడు ప్రేక్షకులను ఎంతవరకు ఎంగేజ్‌ చేయగలిగాడు? అన్నదే ముఖ్యం. మరి..తాజాగా హిందీలో రూపొందిన ‘రామాయణ’ (తెలుగులో ‘రామాయణం’) సినిమా ప్రేక్షకులను మరోమారు ఆకట్టుకుంటుందా? బాలీ వుడ్‌లో ‘దంగల్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా తీసిన నితేష్‌ తివారి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అనేది రివ్యూలో చదివేద్దాం.

కథ

అసురుల జాతిపై ఎప్పుడూ దేవతలదే పైచేయి. శ్రీమహావిష్ణువు ఆశీర్వాదంతో ఇంద్రుడు ఎప్పుడూ అసురలపై విజయం సాధిస్తూనే ఉంటాడు. ఈ పోరాటంలో అసురుల జాతి అంతమొందే స్థితికి చేరు కుంటుంది. లంక నగరాన్ని కుబేరుడు పరిపాలిస్తుంటాడు. ఇక అసురుల జాతి నాయ కురాలు కైకసి (శోభన) ఎంతో బాధపడుతుంది. దీంతో తన తొలి కుమారుడు దశాననుడుకి తమ జాతి దీనస్థితిని వివరించి, ఈ పరిస్థితుల నుంచి గట్టేక్కించాలని చెబుతోంది. దీంతో దశాననుడు కఠోర తపస్సు చేసి, బ్రహ్మాదేవుణ్ణి పసన్నం చేసుకుని అమరత్వాన్ని వరంగా అడుగుతాడు. బ్రహ్మాదేవుడు ప్రసాదిస్తాడు. ఈ శక్తితో దశాననుడు ముందుగా లంక నగరాన్ని, ఆ తర్వాత ముల్లోకాలను ఆక్రమిస్తాడు. ఈ దశాననుడే రావణుడు (యశ్‌). మరోవైపు అయోధ్యలో దశరథ మహారాజు తొలి పుత్రుడు రాముడు (రణ్‌బీర్‌కపూర్‌) పట్టాభిషేకం సమయంలో జరిగిన అనుకోని పరి ణామాలు ఏమిటి? రాముడు భార్య సీతను రావణుడు ఎందుకు అపహరించాల్సి వచ్చింది? అన్నది ‘రామాయణ పార్టు 1’లో చూడొచ్చు (Ramayanam Review and rating).

విశ్లేషణ

రామాయణం ఇతిహాసం ఆధారంగా ఎన్నో సినిమాలను ప్రేక్షకులు చూశారు. ఇప్పటికీయూట్యూబ్‌ వేదికగా రామాయణం చూడొచ్చు. కానీ దర్శకుడు నితేష్‌ తివారి విజన్‌లోని ‘రామాయణం’ కాస్త విభిన్నమైన ది. ఈ విలక్షణనతు ‘రామాయాణ పార్టు 1’ సినిమాలో చూపించడంలో దర్శకుడు నితేష్‌ తీవారి ఫస్ట్‌క్లాస్‌లో పాస్‌ అయ్యారు.

అసురుల జాతికి, ఇంద్రుడుకి మధ్య జరిగే పోరాటంతో ‘రామాయణం పార్టు 1’ కథ మొదలవుతుంది. ఆ తర్వాత దశాననుడు ముల్లోకాలకు రాజు కావడం, మరోవైపు అయోధ్యలో రాముడు వనవాసాని వెళ్లడం.. వంటి ఘటనలతో ఫస్ట్‌హాఫ్‌ ముగుస్తుంది. విద్యుత్‌జీహ్యూడు (వివేక్‌ ఓబెరాయ్‌) – రావణుడి మధ్య సన్నివేశాలు, రాముడుని శూర్పణక ఇష్టపడటం, సీతాపహరణం, రావణుడితో జటాయు పోరాటం, సీతను తిరిగి తీసుకువస్తానని రాముడు అనడంతో ‘రామాయణం పార్టు 1’ ముగుస్తుంది. తొలిభాగంలో రాక్షసు లను రాముడు చంపడం, అయోధ్యలోని కూపగ్రహంలో జరిగిన సన్నివేశాలు హైలైట్‌ అయితే, మలి భాగంలో రావణుడు – జటాయు మధ్య జరిగే పోరాటం మేజర్‌ హైలైట్‌గా ఉంటుంది. కానీ సినిమా సడన్‌గా అయిపోయిన ఫీలింగ్‌ కలుగుతుంది (Ramayana review)

Ranbirkapoor look At Ramayanam Movie

వాల్మీకి రామాయణం ఆధారంగా వచ్చిన సన్నివేశాలనే ఇప్పటివరకు ప్రేక్షకులు ఎక్కువగా చూసి ఉంటారు. కానీ ఈ రామాయణం మరో కోణంలో ఉంటుంది. సీత స్వయంవరానికి రావణుడు రాడు, దశననుడు భర్త ఓ రుషి, అతని ప్రస్తావన ఉండదు. ఇలా మరికొన్ని అంశాలు ఉన్నాయి. పాటల పరంగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం ఒకే. కానీ ఆర్‌ఆర్‌ బాగుంది. కథలో కొత్తదనం ఒక్కటే ఈ సినిమా ప్రత్యేకత కాదు. విజువల్‌గా ఈ సినిమా ఆడియన్స్‌ కళ్ల ముందు ఒక విజువల్‌ వండర్‌లా కనిపిస్తుంది. గ్రాఫిక్స్, విజువల్స్‌ నెక్ట్స్‌ లెవల్లో ఉన్నాయి. ప్రతి పది నిమిషాలకొక హై ఇవ్వడంలో నితేష్‌ తివారి సక్సెస్‌ అయ్యాడు. పిల్లలకు సైతం ఈ సినిమా నచ్చుతుంది. ‘రామాయణ పార్టు 1’ సడన్‌గా ఎండ్‌ అయిన ఫీలింగ్‌ ఉన్నప్పటకీని, ‘రామాయణం పార్టు 2’లో హనుమంతుడు (సన్నీ డియోల్‌) ప్రస్తావన, మేథనాథుడు (రాఘవ్‌ జుయల్‌) ఎంట్రీ. .‘రామాయణం పార్టు 2’పై ఆడియన్స్‌లో ఆసక్తిని రేకేత్తించాయి.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

రాముడి పాత్రలో రణ్‌బీర్‌కపూర్‌ (Ranbirkapoor)  అత్యద్భుతంగా నటించాడు. చాలా సెటిల్డ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. మరీ.. ముఖ్యంగా అయోధ్యలో రాముడి పట్టాభిషేకం సమయంలో రణ్‌బీర్‌కపూర్‌ చేసిన యాక్టింగ్‌ సూపర్భ్‌. సుభాహు, తాటకీలను వధించడం, వనవాసంలో ఉన్నప్పుడు వేల సంఖ్యలో ఉన్న అసురల నుంచి తన సోదరుడు లక్ష్మణుడు, భార్య సీతకు భరోసాను ఇవ్వడం…వంటి యాక్షన్‌ సీక్వెన్స్‌ల్లోనూ రణ్‌బీర్‌కపూర్‌ భళా అనిపించాడు. సీతస్వయంవరంలో అందంగాను కనిపించాడు. మొత్తానికి రణ్‌బీర్‌కపూర్‌ కెరీర్‌కు ఇది ఒక మైల్‌స్టోన్‌ మూవీ అనే చెప్పవచ్చు.

Sai pallavi at ramayanam movie look

సీతగా సాయిపల్లవి (Saipallavi) బాగోలేరు అని చెప్పలేం కానీ మరొక సరైన నటి అయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. అయితే అది కొన్నిచోట్ల మాత్రమే. రావణుడిగా యశ్‌ (Yash) నటన అద్భుతమనే చెప్పాలి. ముఖ్యంగా విద్యుత్‌ జిహ్యూడుతో జరిగే పోరాటం, జటాయుతో జరిగే పోరాటం, ఫస్ట్‌హాఫ్‌లో లంకను ఆక్రమించుకోవడం, మరీ..ముఖ్యంగా రావణతాండవం…ఇలా అన్నీ సన్నివేశాల్లోనూ యశ్‌ నటన ఆడియన్స్‌ను కట్టిపడేస్తుంది. కైకేయిగా లారా దత్తా, దశరథుడిగా అనిల్‌ గోవిల్, శూర్పణకగా రకుల్‌ప్రీత్‌సింగ్, లక్ష్మణుడిగా రవిదుబే, విద్యుత్‌ జిహ్యూడిగా వివేక్‌ ఓబెరాయ్‌ వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు.

Yash at Ramayanam Movie

ఏఆర్‌ రెహమాన్, హన్స్‌ జిమ్మర్‌ ద్వయం మ్యూజిక్‌ ఫర్వాలేదనిపిస్తోంది. కానీ ఇంకాస్త ఇంపాక్ట్‌ ఉండా ల్సింది. పంకజ్‌కుమార్, మహేష్‌లిమాయే విజువల్స్‌ సూపర్భ్‌. ఈ సినిమాకు కనిపించని హీరోల్లో వీరు ఉన్నారు. ఇక నమిత్‌మల్హోత్రా నమ్మినది నిజమైంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఏ మాత్రం రాజీలేని నిర్మాణం జరిగింది. ఇందులో సహ–నిర్మాతగా ఉన్న యశ్‌ను మరువలేం. మూడు గంటల పదిహేను నిమిషాల నడివి కాస్త ఎక్కువే అయినా తన నరేటివ్‌తో నితేష్‌ తివారి ఆడియన్స్‌ను మెప్పించగలిగారు. సినిమాటిక్‌ విజువల్స్‌ ఎక్స్‌పీరియన్స్‌ తాలుకూ విజన్‌ను వెండితెరపైకి తీసుకు రావడంలో సక్సెస్‌ అయ్యారు. సీతతో యాక్షన్‌ సీక్వెన్స్‌ చేయించడం అనేది మాత్రం కాస్త కన్వెన్సింగ్‌గా అనిపించలేదు.

చివరిగా: అందరు చూడాల్సిన అద్బుత దృశ్యకావ్యం. నేటి తరం యువతకు కూడా నచ్చేలా ఉండటం ఈ పురాణగాథ ప్రత్యేకత. చిన్నారులను ఒకసారి వారి తల్లిదండ్రులు ఈ సినిమాను చూపించాలన్నట్లుగా ఈ సినిమా ఉంటుంది.

Rating : 3.5/5

ఇక ‘రామాయణం పార్టు 2’ సినిమా 2028లో రిలీజ్‌ కానుంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah