ముల్లోకాల సాక్షిగా రావణుడిని వధిస్తాను

Viswa
2 Min Read

Web Stories

Ramayana Telugu Trailer: భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో రూపొందుతున్న సినిమా ‘రామాయణ’ (Ramayana Movie). ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్, సీతగా సాయిపల్లవి, లక్ష్మణుడిగా రవి దుబే, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్, శూర్పణకగా రకుల్‌ప్రీత్‌సింగ్, మండోదరిగా కాజల్‌ అగర్వాల్‌ (Ramayana cast and crew)  నటిస్తున్నారు. నితీష్‌ తివారి దర్శకత్వంలోని ‘రామా యణ’ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. యశ్‌తో కలిసి నమిత్‌మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నవంబరు 8న ‘రామాయణ’ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణ పార్ట్‌ 1’ సినిమాను ఇండియాలో ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థ రిలీజ్‌ చేస్తుండగా, ఓవర్‌సీస్‌లో సోనీ పిక్చర్స్‌ సంస్థ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది.

SaiPallavi At Ramayana Trailer
SaiPallavi At Ramayana Trailer

తాజాగా ‘రామాయణ’ సినిమా ట్రైలర్‌ను వివిధ భాషల్లో రిలీజ్‌ చేశారు. ఈ క్రమంలో తెలుగు ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

‘దేవలోకం, భూలోకం, పాతాళలోకం..ముల్లోకాలు ఒక ఒక్కటే సామ్రాజ్యం….రావణ రాజ్యం’

‘సృష్టికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా విష్ణుభగవానుడు అవతారం ఎత్తి…లోకాన్ని రక్షించాడు’

‘కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను..శూర్పణఖ, రాముడి మరణం భీకరంగా ఉంటుంది..అవమానం ఘోరంగా ఉంటుంది’

‘రావణుడు ముల్లోకాలకు అధిపతి అయితే…ఆ ముల్లోకాల సాక్షిగానే నేను అతన్ని వధిస్తాను. నా సీతను నేను తిరిగి తీసుకు వస్తాను’’ అన్న డైలాగ్స్‌ ‘రామాయణ’ సినిమా తెలుగులో ట్రైలర్‌లో ఉన్నాయి.

Yash As Ravana in Ramayana Movie

రామాయణ సినిమా ట్రైలర్‌ వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌పై మిశ్రమ స్పందన లభిస్తోంది. ఏఐ వినియోగించారనే ప్రచారం సాగుతోంది. కొన్ని షాట్స్‌ అలానే కనిపిస్తున్నాయి. ఇంకా ఈ ‘రామాయణ’ సినిమాలో రాముడి గానే కాక, పరశురాముడుగానూ రణ్‌బీర్‌కపూర్‌నే నటించడం విశేషం. ఈ సినిమాను దాదాపు రూ.4 వేల కోట్ల రూపాయాలతో నిర్మిస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం ఒక పార్టు చిత్రీ కరణ మాత్రమే జరిగిందని తెలిసింది. రణ్‌బీర్‌కపూర్, యశ్‌ల మధ్య కాంబినేషన్స్‌ సీన్స్‌ ఇంకా చిత్రీకరించ లేదు.

 

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu