Kajal Aggarwal: ‘రామాయణ’ సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా తొలిభాగం ‘రామాయణ పార్టు 1’ నవంబరు 5న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను కూడా పాన్ ఇండియా లెవల్లో ఘనంగా చేస్తున్నారు దర్శక–నిర్మాతలు.
ఈ చిత్రంలో రాముడిగా నటించిన రణ్‌బీర్‌కపూర్, సీతగా నటించిన సాయిపల్లవి, రావణుడిగా నటించిన యశ్…ఇలా ప్రతి ఒక్కరూ ప్రమోషన్స్‌లో కనిపించారు. శూర్ఫనఖ పాత్రలో నటించిన రకుల్‌ప్రీత్‌సింగ్ కూడా ప్రమోషన్స్‌లో సందడి చేశారు. కానీ సినిమాలో ‘రావణుడి భార్య మండోదరిగా నటించిన కాజల్ అగర్వాల్ మాత్రం ఇప్పటివరకు ప్రమోషన్స్‌లో కనిపించలేదు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్…ఇలా ‘రామాయణ’ సినిమాకు సంబంధించిన ఏ ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ కాజల్ అగర్వాల్ (Heroine Kajal Aggarwal) కనిపించలేదు. దీంతో కాజల్ మౌనం వెనక కారణం ఏమై ఉంటుందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది.
‘రామాయణం పార్టు 1’ (Ramayanam Part 1) లో ఆమె సన్నివేశాలను ఏమైనా తొలగించారా? లేక అసలు..పార్టు 1లో కాజల్ సీన్స్ లేనందుల్లే ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదా? అన్న విషయాలపై క్లారిటీ వస్తే సరిపోతుంది.
పెద్ద దర్శకులే ఇలా చేస్తే ఎలా?
గతంలోనూ కాజల్ అగర్వాల్ యాక్ట్ చేసిన చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో, ఆమె సన్నివేశాలను చాలా తీసేశారు. అలాగే కాజల్ అగర్వాల్ ‘భారతీయుడు’ ఫ్రాంచైజీలో భాగమైయ్యారు. కానీ ‘భారతీయుడు 2’లో కాజల్ కనిపించలేదు. ఇప్పుడు ‘భారతీయుడు 3’ రెడీ అవుతోంది. సో..భారతీయుడు 3 సినిమాలో కాజల్ కనిపించాలనే ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
ఇక ‘రామాయణం’ సినిమాకు నితేష్ తివారీ దర్శకత్వం వహిచంగా, నమిత్ మల్హోత్రా–యశ్‌లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.