Cult Movie Review: కథ
గోవా హోమ్మినిస్టర్ (మురళిశర్మ ) తనయుడు ఎల్విన్ (తారక్ పొన్నప్ప ) బర్త్‌డే సెలెబ్రేషన్స్ #కల్ట్ అనే పబ్ లో స్టార్ట్ అవు తాయి. ఎంట్రీ పాసులు దొంగతనం చేసి, ఈ బర్త్‌డే పార్టీ కి ముగ్గురు హైదరాబాద్ కుర్రాళ్ళు వెళ్తారు. పార్టీ స్టార్ట్ అయిన కొంత సేపటికి అక్కడి ఓ ఎల్. ఈ. డీ స్క్రీన్ పై ఒక బొమ్మ కనిపిస్తుంది. పబ్ లో పాల్గొన్న వాళ్ళు గేమ్ ఆడాలని, ఆడని వాళ్ళు లేదా గేమ్ లో ఒడిపోయిన వాళ్ళు పనీష్ చేయ బడతారని ఆ బొమ్మ మాట్లాడుతుంది. ఆ బొమ్మ మాటలను పట్టించుకొని వాళ్ళు అతి దారుణంగా హత్య చేయబడతారు.
ఒక్కసారిగా పబ్ లోఉన్న వాళ్ళు ఆందరూ షాక్ అవుతారు. వీళ్ళు పబ్ లోనుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. మళ్ళీ మళ్ళీ గేమ్స్ లో ఫెయిల్ అయిన వాళ్ళు అతి క్రూరంగా హత్య చేయబడతారు. అయితే పబ్ లోపల ఉన్న వాళ్లలో DSP సంకల్ప్ నాయక్ ఉంటాడు. మరి… పబ్ లోపల ఉన్న వాళ్ళను సంకల్ప్ ఎలా కాపాడాడు? డేంజర్ గేమ్స్ ఆపరేటర్ ఎవరు? నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎల్విన్ బర్త్‌డే కి, అతని ప్రెజెంట్ బర్త్‌డే కి ఉన్న లింక్ ఏంటి? అన్నది సినిమా కథనం (Cult Movie Review).
Vishwaksen Cult Movie Review: విశ్లేషణ
సున్నితమనస్కులు, చిన్న పిల్లలు ‘కల్ట్’ సినిమాకు దూరంగా ఉండాలని విశ్వక్సేన్ ముందే చెప్పాడు. విశ్వక్ తన మాటకు కట్టుబట్టాడు. వెండితెరని ఎరుపు ఎక్కించాడు. ఫస్ట్‌హాఫ్‌లో తొలి నలభై నిమిషాలు గడిచిన తర్వాత, నిమిషానికి ఒకరు చనిపోతూనే ఉంటారు. అది కూడా అతి కిరాతకంగా హత్య చేయబడు తుంటారు. ‘స్క్విడ్ గేమ్స్’ సిరీస్ చూసేవాళ్లకు ఈ సినిమా విజువల్స్ కొత్తగా అనిపించకపోవచ్చు కానీ సాధారణ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా రక్తసిక్తంగానే కనిపిస్తుంటుంది. ఇక కథ పరంగా విశ్వక్ ఎంచుకున్న పాయింట్ కాస్త కొత్తగా అనిపించినప్పటికీని, వెండితెరపై చూపించిన తీరు మాత్రం పాతగానే ఉంది.

పబ్‌లో చంపబడుతున్నారు ఎందుకు చంపబడుతున్నారు? అనే దానికి సెకండాఫ్‌లో జస్టిఫికేషన్ చూపించబోయాడు విశ్వక్. కానీ ఇందులో తడబడ్డాడు. ఓ ఇన్సిడెంట్లో భాగమైపోయిన వారితో పాటుగా, కొంతమంది అమాయకులను కూడా మాస్క్మేన్ చంపాలనుకున్నాడు. అంత ఎందుకు తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు హీరోనే చంపాలనుకున్నాడు. అలాంటప్పుడు మాస్క్మేన్ ఎలా మంచివాడు అవుతాడు? మళ్లీ ఇతనికి హీరో సాయం చేయాలనుకోవడం కన్విన్సింగ్‌గా లేదు. క్లైమాక్స్‌లో వచ్చే ఎన్ఎస్జీ కమేండో సీక్వెన్స్ కూడా నప్పలేదు. అక్కడ వారి ప్రస్తావనే అవసరం లేదు. ఇక ఆర్డీఎక్స్ బాంబ్ అంటూ నానా హడావిడి చేసి, చివర్లో ఓ చిన్న వైర్‌ను కట్ చేసి అయిపోయిందని చెప్పడం ఆడియన్స్‌ను తక్కువగా అంచన వేయడమే. ఇలాంటి మరికొన్ని మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. పైగా హీరో ప్రీ ఇంట్రవెల్ వరకు వెండితెరపై కనిపించడు. పోనీ అప్పటివరకు ఏమైనా ఎంగేజింగ్ సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయా? అంటే అదీ లేదు.
వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శకుటుంబం’ రివ్యూ…వందకోట్ల లాటరీతో ఏం జరిగింది?
నటీనటుల పెర్ఫార్మెన్స్
దర్శకుడిగా, యాక్టర్‌గా ఈ సినిమా కోసం విశ్వక్సేన్ వర్క్ చేశారు. కానీ ఈ సినిమా వరకు నటుడిగానే మెప్పించగలిగారు. యాక్షన్ సీన్స్‌లో తనదైన మార్క్ చూపించారు. ఉన్నంతో స్టైలిష్‌గా వెండితెరపై కనిపించే ప్రయత్నం చేశారు. గోవా హోం మినిస్టర్‌గా మురళీశర్మ, అతని కొడుకు ఎల్విన్గా తారక్ పొన్నప్ప, పోలీస్ ఆఫీసర్‌గా శ్రీకాంత్ అయ్యంగార్, మాయగా గాయత్రిభరద్వాజ్ వారి వారి పాత్రల పరిధిమేరకు నటించారు. చాలామంది కొత్తవాళ్లు ఈ సినిమాతో వెండితెరపై కనిపించారు. ఇక దర్శకుడిగా విశ్వక్ ఈ సారి ఫెయిల్ అయ్యాడు. స్టార్ హీరోస్ ఉన్నా కూడా కథ ఎంగేజింగ్‌గా లేకపోతే, ఏ మాత్రం శాటిస్ఫై కానీ మూడ్‌తో ఉన్న ఆడియన్స్ ఉంటున్న ఈ కాలంలో, హీరోనే ప్రీ ఇంట్రవెల్ వరకు రాకపోతే కష్టమే కదా!. ఎడిటింగ్ ఒకే. నిర్మాణ విలువలు బాగున్నాయి. రవి బస్రూర్ మ్యూజిక్ అంతగా మెప్పించ లేకపోయింది.
చివరిగా: కల్ట్…డేత్గేమ్స్
రేటింగ్ 2/5