ఉన్నంతలో మనకున్నంతో బతికితే….

Viswa
1 Min Read
Bhaja Govindam lyrical video song

Web Stories

 Bhaja Govindam Song: ‘రియాలిటీ’ సినిమా నుంచి వచ్చిన ‘భజగోవిందం’ ( Bhaja Govindam Song) పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది. ‘‘భజ గోవిందం భజగోవిందం బ్రతుకే కోలాహలం..భజ భజ గోవిందం బరువేకాదేక్షణం’ అంటూ మొదలవుతుంది ఈ పాట. సనారే అందించిన లిరిక్స్‌ ఈ పాటకు బాగా ఫ్లస్‌ అయ్యాయి. అలాగే వైకోమ్‌ విజయలక్ష్మి గాత్రం ఈ సినిమాకు మరో మేజర్‌ ఏట్రాక్షన్‌గా నిలిచింది. సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరోలియో ఈ పాటను స్వరప రచారు. ‘ఉన్నంతలో మనకున్నంతో బతికితే అదే సుఖము..ఎవరికి తలొంచక నీవు నీ కాళ్ళపై నిలబడే గుణం వరము..’ అంటూ ఈ పాట లిరిక్స్‌ సాగుతాయి.

మనిషే దేవుడిలా మారితే…!

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తూ, కథ–స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటుగా, తొలిసారి దర్శకత్వం వహి స్తున్న ఈ రియాలిటీ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 25న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఓ హోటల్‌ రన్‌ చేసే ఆనందం పాత్రలో కిరణ్‌ అబ్బవరం, ఆలోచన రోల్‌లో దేవికాభట్‌ నటించారు. శరత్‌ కుమార్, సాయికుమార్, రోహిణి ఇతర కీలక పాత్రల్లో నటిస్తారు. జాయ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై సుధాకర్‌ చాగంటి ఈ సినిమాను నిర్మించారు. సురేష్‌ యెర్రా ఈ సినిమాకు సహ–నిర్మాత.

Bhaja Govindam Lyrical song
Bhaja Govindam song

మరోవైపు బాలకృష్ణ ‘దాదా’, నాగార్జున ‘కింగ్‌ 100’ సినిమాలు కూడా క్రిస్మస్‌ రిలీజ్‌కు సిద్ధం అవుతున్న నేపథ్యంతో డిసెంబరు 25న రిలీజ్‌ కానున్న ‘రియాలిటీ’ సినిమా ఆడియన్స్‌ను ఎంతమేరకు థియేటర్స్‌కు రప్పించగలుగుతుంది, ఈ బాక్సాఫీస్‌ పోటీలో ఏ మేర సక్సెస్‌ అవుతుంది అన్నది చూడాలి.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu