Comrade Kalyan: శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరో యిన్‌గా నటించగా, రాధికాశరత్‌కుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. 1992 కాలంలో ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో జరిగే ఈ పీరియా డికల్ సినిమాకు జానకిరామ్ మారెళ్ల దర్శకుడు. కోనవెంకట్ సమర్పణలో వెంకట కృష్ణ కర్ణాటి, సీత కర్నాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘ఒరియా పిల్ల’ సాంగ్ (Oriya Pilla) లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్.
ఈ కామ్రేడ్ కల్యాణ్ సినిమా కోసం అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్ చేశామని శ్రీవిష్ణు తెలిపారు. ఈ సినిమా కోసం తానొక కొత్త భాషను మాట్లాడతానని, ఈభాషను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని కూడా శ్రీవిష్ణు వెల్లడించారు. అలాగే మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను ఓ కొత్త పాత్రలో ఆడియన్స్ చూస్తా రని, ఆయన పాత్ర ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తుందని చెప్పారు శ్రీవిష్ణు. ఇక హీరో శ్రీవిష్ణు కెరీర్‌లోనే ఈ ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా ఓ సూపర్‌హిట్‌గా నిలుస్తుందని జోస్యం చెప్పారు రచయిత నిర్మాత కోన వెంకట్. ఈ సినిమాలో ఉన్న నాలుగూ పాటలు ఆడి యన్స్‌ను అలరిస్తాయని చెప్పారు దర్శకుడు జానకి రామ్. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ స్వరకల్పనలో, సిద్ శ్రీరామ్ ఈ పాటను పాడగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
