Thalaiver173 update: రజనీకాంత్ హీరోగా సిబీ చక్రవర్తి డైరెక్షన్లో ఓ మూవీ రానుంది. రజనీకాంత్ కెరీర్‌లోని ఈ 173వ సిని మాను కమల్‌హాసన్ నిర్మిస్తారు. ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటుగా, ఈ సినిమాలో ఓ చిన్న గెస్ట్ రోల్ కూడా కమల్‌హాసన్ చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.
ఇక ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రీపొడక్షన్ వర్క్స్ జరుగు తున్నాయి. నటీనటుల ఎంపిక కూడా మొదలైంది. ఈ సినిమాలోకి ఓ కీలక పాత్రలో సాయిపల్లవి నటిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
ఈ సంగతి ఇలా ఉంచితే..రజనీకాంత్ 173వ సినిమాలో ఓ టైలర్ పాత్రలో నటించనున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ డ్రామా ‘ది అవుట్‌ఫిట్’ సినిమాకు తమిళ రీమేక్‌గా ఈ సినిమా ఉండబోతుందనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తుంది.అయితే ఈ విషయంపై పూర్తిస్థాయి సమాచారం అందాల్సి ఉంది. వచ్చే పొంగల్‌కి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో రిలీజ్ కానుంది. నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సినిమాకు దర్శకుడు. రజనీ–నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గానే ‘జైలర్ 2’ (Jailer2 news) చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.
Very insightful commentary on treatment timelines and optimal therapeutic thresholds. Clear, concise, and academically sound review of the active mechanisms involved.
An exceptionally clear and evidence-based analysis. The structured recommendations for mitigating potential adverse interactions and monitoring baseline metrics are invaluable.