తమిళ నటి ప్రియాభవానీశంకర్ వివాహం చేసుకున్నారు. దాదాపు పధ్నాలుగు సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న రావ్వేల్ రాజ్‌ను ప్రియా వివాహం చేసుకున్నారు. రాజ్‌వేల్ రాజ్- ప్రియాభవానీశంకర్ల వివాహం బుధవారం (11-11-2026) జరిగింది. గతంలోనే ఈ ఇద్దరు వివాహం చేసుకోబోతున్నారనే ఊహాగానాలు ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ, ఈ విషయం పై ఇరువురు పెద్దగా మాట్లాడలేదు. ఫైనల్‌గా వివాహ బంధంతో ఒక్కటైయ్యారు.
ఇక టెలివిజన్ ప్రజెంటర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ప్రియాభవానీశంకర్ తన ప్రతిభతో హీరోయిన్ స్థాయికి ఎదిగారు. తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ‘కల్యాణం కమనీయం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రియ, ఆ తర్వాత గోపీచంద్ ‘భీమా’, సత్యదేవ్ ‘జీబ్రా’ వంటి చిత్రాల్లో నటించారు. అయితే రవితేజ హీరోగా నటించి, ఇటీవలే విడుదలైన బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఇరుముడి’లో హీరోయిన్గా నటించి, తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యారు ప్రియాభవానీశంకర్. ఇక ఆమె నటిస్తున్న తమిళం చిత్రం ‘డిమాంట్ కాలనీ’ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి.





