పవన్‌కళ్యాణ్‌, అనా కొణిదెల వైవాహిక బంధానికి ముగింపు

Kumar NA
1 Min Read

Web Stories

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ నాయకులు, నటుడు– దర్శక–నిర్మాత–గాయకుడు కొణిదెల పవన్‌కళ్యాణ్ (Pawan Kalyan Divorved) , ఆయన సతీమణి అనా కొణిదెల (Anna Konidela divorced) విడాకులు తీసుకుంటున్నారు. ఈ మేరకు నవంబరు 9 (సోమవారం) రాత్రి వేళ ఓ ఉమ్మడి ప్రకటనను పవన్, అనా రిలీజ్‌ చేశారు. తమ జీవితం లో ఎంతో ముఖ్యమైన సమయాన్ని గడిపిన తర్వాత పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు పవన్‌– అనా ఆ నోట్‌లో తెలిపారు.

ఇంకా తమ వైవాహిత జీవితం ముగిసిపోయిన్పటికీని, తాము మంచి స్నేహితులుగానే కొనసాగుతామని, తల్లిదండ్రులుగా పిల్లలపట్ల బాధ్యతాయుతమైన కర్తవ్యాన్ని నిర్వర్తించేలా మసులుకుంటామని పవన్‌–అనా పేర్కొన్నారు. తమ పిల్లల శ్రేయస్సు, సంతోషమే ఎల్లప్పుడు తమ ఉమ్మడి ప్రాధాన్యాంశంగా ఉంటుందని కూడ ఆ నోట్‌లో ప్రస్తావించారు. అలాగే ఈ పరిస్థితుల్లో తమను అందరు అర్థం చేసుకుంటారని, సాను భూతితో వ్యవహరించి, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఇంకా తమ ప్రయాణంలో సపోర్ట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలను తెలియజేస్తున్నట్లు పవన్‌–అనా తమ నోట్‌లో స్పష్టం చేశారు. ఇక 2013 సెప్టెంబరు 30న పవన్‌కల్యాణ్, అనాల వివాహం జరిగింది. ఈ దంపతులకు
ఒక కుమార్తె, ఒక కుమారుడు సంతానం.

ఈ సంగతి ఇలా ఉంచితే…..2009లో నటి రేణుదేశాయ్‌తో పవన్‌కళ్యాణ్‌ రెండో వివాహం జరగ్గా, ఆ తర్వాత ఈ ఇద్దరు విడిపోయారు. అంతకుముందు పవన్‌కల్యాణ్‌ తొలి వివాహం 1997లో నందినితో జరగ్గా, ఆమెకు విడాకులు ఇచ్చారు పవన్‌కళ్యాణ్‌. తాజాగా అనాతో తన వైవాహిక జీవితానికి పవన్‌ గుడ్‌ బై చెప్పారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah