goat movie review: వెండితెరపై మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ …వెండితెరపై కూడ సత్తా చాటాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్న ప్రేక్షకులకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన తాజాగా ‘గోట్’ సినిమా చేశారు. మరి..ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించగలిగిందా?
| సినిమా | G.O.A.T (goat movie review) |
|---|---|
| ప్రధాన నటీనటులు | సుధీర్ ఆనంద్, దివ్యభారతి, మొట్ట రాజేంద్రన్, నితిన్ ప్రసన్న, సర్వదామన్ బెనర్జీ, ఆనంద రామరాజు, చమ్మక్ చంద్ర |
| దర్శకత్వం | వేదవ్యాస్ |
| నిర్మాతలు | మొగుళ్ల చంద్రశేఖర్ |
| సంగీతం | లియోన్ జేమ్స్ |
| కెమెరా | రసూల్ ఎల్లోర్, సన్నీ కొర్రపాటి |
| ఎడిటింగ్ | విజయ్.ఎమ్ |
| విడుదల తేదీ | 12-11-2026 |
| నిడివి | 2 గంటల 32 నిమిషాలు |
| సెన్సార్ | యూ బై ఏ (16 ఫ్లస్) |
| రేటింగ్ | 2/5 |
కథ
గణపతిరాజు ఆలియాస్ సార్ (సుడిగాలి సుధీర్) క్రికెట్ బెట్టింగ్ చేస్తూ డబ్బులు పొగొట్టుకుంటాడు. ఒక ఓ పెద్ద సెటిల్మెంట్ చేసి బాగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసే డీల్‌కు ఒప్పు కుంటాడు. తన గ్యాంగ్‌తో కలిసి ఆనందపురం వెళ్లి, తాము కిడ్నాప్ చేయాల్సిన పెళ్లికూతుర్ని కాకుండ, మ రొక పెళ్లికూతురు సుభాషిణి (దివ్యభారతి)ని తమ వెంట తీసుకుని వెళ్తారు. అసలు విషయం తెలిసిన తర్వాత సుభాషిణిని వదిలించుకునే ప్రయత్నం చేస్తాడు సార్. కానీ సుభాషిణితో ప్రేమలో పడతాడు. కానీ సుభాషిణి తనకు దక్కాలంటే పదిలక్షల రూపాయాలు కావాలి. మరి…సార్ ఏం చేశాడు. రుద్రవరంలో ఒకప్పటి స్టార్ క్రికెటర్ అయిన గణపతిరాజు మరోచోట సార్ పేరుతో ఎందుకు బతుకుతున్నాడు? ఎందుకు క్రికెట్‌ను వదిలేశాడు? గోదావరి అవుట్డోర్ యాక్టివిటీ ట్రస్ట్ (జీ.వో.ఏ.టీ)కి గణకు ఉన్న సంబంధం ఏమిటి? రుద్రవరంతో సుభాషిణికి ఉన్న లింక్ ఏమిటి? అన్నది సినిమాలో చూడాలి.
విశ్లేషణ
1983లో వన్డే క్రికెట్ ప్రపంచకప్ భారతదేశం గెల్చుకున్న తర్వాత బెట్టింగ్ వ్యవహారాలు బాగా పెరిగిపో యాయని, మరోవైపు బెట్టింగ్ రహిత గ్రామాలు కూడా ఉన్నాయని చెప్పే వాయిస్ ఓవర్‌తో ‘గోట్’ సినిమా ఆసక్తికరంగానే స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఆసక్తి ఆద్యంతం సాగదు. రోటీన్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ప్రేక్షకులు ఊహించదగ్గ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథనం ఉంటుంది. తన గ్యాంగ్‌తో హీరో చేసే కామెడీ సన్నివేశాలు ఒకింత ఫర్వాలేదు. కానీ అవే రిపీట్ అయినప్పుడు ఆడియన్స్‌కు బోర్ కొడుతుంది. ఈ విష యంలో దర్శకుడు కాస్త జాగ్రత్త తీసుకుని ఉండాల్సింది.పైగా కొన్ని క్రింజ్ కామెడీ సీక్వెన్స్ ఆడియన్స్‌ను బలవంతంగా నవ్వమని చెప్పినట్లు ఉంటుంది.

అలాగే రవితేజ ‘శంభో శివ శంభో’, ఎన్టీఆర్–రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’, ‘రాజన్న’ వంటి సినిమాలకు స్పూప్లా కొన్ని సన్నివేశాలను రాసుకున్నాడు దర్శకుడు. ఇవి ఏవీ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ మెట్ట రాజేంద్రన్ ‘ఫా’ పలకడం, నాగిరెడ్డి, పెద్దిరెడ్డి రావడం.. అనే సీన్స్ ఆడియన్స్‌ను నవ్విస్తాయి. పెళ్లి మం డపం ఒక అమ్మాయికి బదులు, హీరో…హీరోయిన్ను తీసుకురావడం, హీరోయిన్ తరఫువాళ్లు హీరోపై పగసాధించాలని అనుకోవడం ఇప్పటి జెన్‌జీ స్టైల్ ఫిల్మ్‌మేకింగ్ అయితే కాదు. క్రికెట్ సీక్వెన్స్‌లు కూడా కొత్తగా ఏమీ ఉండవు. పైగా హీరో, హీరో తాత, హీరోయిన్, విలన్…వీరందరికీ ఓ బ్యాగ్రౌండ్ స్టోరీ ఉంటంది. ఇది ఆడియన్స్ సహనాన్ని పరీక్షించడమే. సెంటిమెంటల్ సీక్వెన్స్ కూడా వర్కైట్ కావు. ఎందు కంటే..కొత్తదనం లేదు.
నటీనటుల పెర్ఫార్మెన్స్
గణపతి ఆలియాస్ సార్ పాత్రలో సుడిగాలి సుధీర్ ఒదిపోయే ప్రయత్నం బాగుంది. స్క్రీన్‌పై యాక్షన్ ఈజ్ ను చూపిం చాలనే ఉత్సాహంలో కాస్తంత సఫలమయ్యారనే చెప్పాలి. హీరోయిన్ సుభాషిణి పాత్రలో దివ్యభారతి చక్కగా యాక్ట్ చేశారు. కథకు ఇంపార్టెన్స్ ఉన్న రోల్లో కనిపించారు. విలన్‌గా నితిన్ ప్రసన్న, హీరో తాతయ్యగా సర్వధామన్ బెనర్జీ, బ్రహ్మాజీ, చమ్మక్‌చంద్ర వారి వారి పాత్రల మేరకు నటించారు. ప్రశాంత్ పాత్రలో మెట్ట రాజేంద్రన్ తాలుకూ కొన్ని సన్నివేశాలు ఆడియన్స్‌ను మెప్పించాయి. వేదవ్యాస్ తన రచనలో కొత్తదనం లేదు. అంటే ప్రేక్షకులను ఎంగేజ్ చేసే డ్రామాను క్రియేట్ చేయలేదు. కేవలం కొన్ని కామెడీ సీక్వెన్స్‌లను మాత్రమే నమ్ముకున్నట్లు ఉన్నారు. బలమైన భావోద్వేగాలు లేవు. లియోన్ జేమ్స్ మ్యూజిక్, మణిశర్మ ఆర్ఆర్ సినిమాకు కాస్తంత బలాన్ని చేకూర్చాయి.
బాటమ్‌లైన్: వెండితెర గ్రౌండ్లో మ్యాచ్ ఓడిన గోట్