Bhari Movie update: హీరో వరుణ్‌తేజ్, ఆయన తండ్రి నటుడు–నిర్మాత నాగబాబు తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. వరుణ్‌తేజ్ హీరోగా ‘కమిటీకుర్రాళ్ళు’ ఫేమ్ యదువంశీ ‘బరి’ (Bhari Movie update) సినిమా తీస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వాలీబాల్ స్పోర్ట్స్ ప్రధానంశంగా సాగే ఈ సినిమాను వరుణ్‌తేజ్ సోదరి నిహారిక కొణిదెల నిర్మించ నున్నారు. ఈ సినిమాలోనే వరుణ్‌తేజ్, నాగబాబు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
బరి సినిమా చిత్రీకరణ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనే వరుణ్‌తేజ్ గాయపడ్డారు. దీంతో ఆయన దాదాపు మూడు నెలలు షూటింగ్‌లో పాల్గొనలేని పరిస్థితి. దీంతో ప్రస్తుతం తన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు వరుణ్‌తేజ్. ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది.
‘బరి’ సినిమా చిత్రీకరణు అక్టోబరులో ప్రారంభిచాలని వరుణ్‌తేజ్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ సమయంలో, ‘బరి’ సినిమాను 2027 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ వరుణ్‌తేజ్ గాయం కారణంగా షూటింగ్ అనుకున్న టైమ్‌లో స్టార్ట్ కాలేదు. దీంతో ‘బరి’ సినిమా రిలీజ్ సంక్రాంతికి ఉండదు. వచ్చే వేసవిలో ఈ సినిమా రిలీజ్ కావొచ్చు.