Fauzi movie Release date: ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘ఫౌజి’ (Fauzi Movie) సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడింది. హనురాఘవపూడి దర్శ కత్వం వహిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాను తొలుత ఈ ఏడాది దసరా సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డిసెంబరు 3కి వాయిదా వేశారు. తాజాగా ‘ఫౌజి’ చిత్రం కాస్త ఆలస్యంగా వస్తుందని నిర్మాతల్లో ఒకరైన వై.రవిశంకర్ తెలిపారు. దీంతో ‘ఫౌజి’ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కావొచ్చనే టాక్ తెరపైకి వచ్చింది. మరోవైపు సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘స్పిరిట్’ సినిమాను వచ్చే ఏడాది మార్చి 5న (Fauzi movie Release date) రిలీజ్ చేయనున్నట్లు గతంలోనే ఓ ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో…ఇప్పుడు మార్చిలో ప్రభాస్ ‘ఫౌజి’ సినిమా రిలీజ్ అయితే, కచ్చితంగా ‘స్పిరిట్’ సినిమా విడుదల వాయిదా పడుతుందని ఊహించవచ్చు.
భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు జరిగే ఈ సినిమా కథనం ప్రధానంగా 1940 బ్యాక్‌డ్రాప్‌తో సాగుతుంది. ఇందులో ప్రభాస్ ఓ సీక్రెట్ సోల్జర్‌గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇమాన్వీ ఎస్మాయిల్ (fauzi movie heroine) ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతుండగా, మిథున్ చక్రవర్తి, అనుపమ్‌ఖేర్, జయప్రద, రాహుల్ రవీంద్రన్, చైత్ర జె.ఆచార్ ఇతర ప్రధాన పాత్రల్లో (Fauzi movie cast and crew) నటిస్తున్నారు. అలాగే ‘ఫౌజి’ సినిమా రెండు పార్టులుగా రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.