The Paradise Story: ‘దసరా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ది ప్యారడైజ్’ (The Paradise Story). ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో కయాదులోహర్ హీరోయిన్‌గా నటించగా, రాఘవ్ జుయల్, సోనాలీకులకర్ణి, మోహన్‌బాబు, సంపూర్ణేష్‌బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న (TheParadise Movie Release date) థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ నెల 23న ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఈ సినిమాను గురించిన విశేషాలను తెలియజేశారు హీరో నాని
– ‘ది ప్యారడైజ్’ సినిమా 1984–1985 నేపథ్యంతో సికింద్రబాద్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ పీరియాడికల్ సినిమా. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథ ‘ది ప్యారడైజ్’ సినిమా. ఇందులో నేను జడల్ అనే పాత్రలో నటించాను. కథ రిత్యా ఇందులో సవారీ అనే తెగ ఉంటుంది. ఈ తెగలో ఒకడు జడల్. ఈ సవారీ తెగలోని జనాలకు గుర్తింపు ఉండదు. వీళ్లు ఎవర్నైనా చంపితే కేసు ఉండదు, వీళ్లను ఎవరైనా చంపితే కేసు ఉంటుంది. ఈ సవారీ తెగ తమ గుర్తింపు కోసం ఏం చేసింది? వీళ్ల నాయకుడు ఏం చేశాడు? అన్న అంశాల నేపథ్యంతోనే ‘ది ప్యారడైజ్’ సినిమా కథనం ఉంటుంది.
– ఈ సినిమాలోని పాటలు, ఫైట్స్ అన్నీ సందర్భానుసారంగానే వస్తాయి. డూప్స్‌ను వాడలేదు. కథలో ఫైట్స్, పాటలు హైలైట్‌గా కనపిస్తున్నప్పటికీని, థియేటర్స్‌లో సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ‘ది ప్యారడైజ్’ చిత్రంలోని ఎమోషన్‌ను ఇంటికి తీసుకుని వెళ్తారు. ఎమోషన్ అంతలా కనెక్ట్ అవుతుంది. ఇందులో మదర్ అండ్ సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను జడలుతోనే కనిపిస్తాను. ఈ సినిమాలోని విలన్ రోల్‌ను మోహన్‌బాబుగారు చేస్తారని నేను మొదట అనుకోలేదు. కానీ ఆయన కథ విని, ఈ సినిమా చేస్తున్నామని చెప్పారు. కయాదులోహర్ పాత్ర సినిమాలో చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం చాలా కష్టపడ్డాను. నా కెరీర్‌లో నేను ఇంతలా కష్టపడ్డ సినిమా ఇదే.

– నన్ను ఎవరూ ఎలా చూసిన, దర్శకుడు శ్రీకాంత్‌మాత్రం నన్నో డ్యాన్సర్‌లా చూస్తాడు. అందుకే ఆయా షేర్, ఏష నాగుల పాటల్లో నా చేత డ్యాన్స్ చేయించాడు. శ్రీకాంత్ నమ్మకం నిజమైంది. మా పాటలకు ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభిస్తోంది. నిర్మాత సుధాకర్‌గారు బాగా సపోర్ట్ చేశారు. ఇక శ్రీకాంత్‌కు మంచి ఆలోచనలు ఉన్నాయి. అనిరు«ద్ మ్యూజిక్‌లో మాస్టర్. ఈ ఇద్దరు ఇలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇందులో అంజనా, అంజనా అనే మరో పాట కూడ ఉంది. అతి త్వరలోనే రిలీజ్ చేస్తాం.
– నేను నిర్మాతగా చిరంజీవి,దుల్కర్ సల్మాన్, కార్తీలతో సినిమాలు చేయాల్సి ఉంది. హీరోగాను సినిమాలు చేస్తున్నాను. త్వరలోనే అన్ని విషయాలు చెబుతాను.
