తెల్లకాగితం సినిమా రివ్యూ…టీనేజ్‌లో తెలియక తప్పుచేస్తే…?

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
2 Min Read
thella kagitham Cinema Review and rating

Web Stories

సినిమా: తెల్లకాగితం (thella kagitham Review)

నటీనటులు: హర్షరోషన్, నక్షత్ర, అజయ్, శరణ్యప్రదీప్, కసిరెడ్డి రాజ్‌కుమార్, దీపక్, శ్రావ్య
దర్శకుడు రమేష్‌ బండ్రెడ్డి
నిర్మాణం కృష్ణకొమ్మాలపాటి
సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌
నిడివి: 2 గంటల 36 నిమిషాలు
రేటింగ్‌: 2.25/5 (thella kagitham Cinema Review and rating)

కథ

రాము (హర్షరోషన్‌), ఆశ (నక్షత్ర) ఒకే స్కూల్లోని వేరు వేరు సెక్షన్లలో పదో తరగతి చదువుతుంటారు. పదో తరగతిలో వీరిమధ్య మొదలైన స్నేహాం… వీరిద్దరు ఇంటర్‌ చదివే సమయంలో ప్రేమగా మారుతుంది. క్లాస్‌ టాపర్‌ అయిన శేఖర్‌తో ఆశ ఫ్రెండ్లీగా ఉండటం రాము గమనిస్తాడు. దీంతో ఆశ తనకు దూరం అవుతుం దనే అనుమానం రాములో ఆందోళనను రేకేత్తిస్తుంది. దీంతో తనపై ఉన్న ప్రేమను నిరూపించుకునేందుకు ఓ తప్పు చేయమని ఆశను ఒత్తిడికి గురిచేస్తాడు రాము. రాము బాధ చూడలేక, ఆశ కూడా అంగీకరిస్తుంది. మరి..ఈ తప్పు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసింది? వీరి ప్రేమకథ ఎలా ముగిసింది? అన్నది మిగి లిన కథనం.

విశ్లేషణ

యుక్తవయసులో కలిగే ఆకర్షణల వల్ల టీనేజ్‌లో ఉన్న యువతీయువకుల జీవితాలు ఎలా నాశనం అవుతా యనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు దర్శకుడు రమేష్‌. కానీ కథ, కథనంలో కొత్తదనం లేదు. రొటీ న్‌ స్క్రీన్‌ ప్లే, ఊహాత్మక సన్నివేశాలు ఆడియన్స్‌కు థియేటర్స్‌లో బోర్‌ కొట్టేలా చేస్తాయి. కథ 2006లో జరు గుతుంది. అప్పటికాలం ప్రకారం ఈ సినిమా కోసం రైటర్‌ నందు రాసిన కొన్ని కామెడీ డైలాగ్స్‌ కూడా అంతగా పండలేదు. అమాయకత్వపు ప్రేమతో కూడిన సన్నివేశాలు, పాటలుతో ఫస్ట్‌హాఫ్‌ ఫర్వాలే దనిపించినా, సెకండాఫ్‌ సినిమాను దెబ్బతీసింది. కథ అంతా కాలేజీ, హాస్పిటల్‌…ఈ రెండు ప్లేస్‌లోనే అక్కడక్కడే తిప్పి చూపించాడు దర్శకుడు. ఈ సన్నివేశాల నిడివి తగ్గించి, సరైన రన్‌టైమ్‌తో ఈ సినిమా ఆడియన్స్‌ ముందుకు వచ్చినట్లయితే, ఈ సినిమా రిజల్ట్‌ మరింత మెరుగ్గా ఉండేది. క్లైమాక్స్‌ బాగానే ఉంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్‌

రాము పాత్రలో హర్ష్‌రోషన్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ఎమోషనల్‌ సీన్స్, డ్యాన్స్‌ పరంగా మరింత మె రుగ్గా కనిపించాడు. కానీ వరుసగా ఒకే తరహా రోల్స్‌ చేస్తుండటం అతని కెరీర్‌కు కాస్త మైనస్‌ కావొచ్చు. తొలిపరిచయంగా కనిపించిన నక్షత్ర మంచి నటన చూపించింది. సహజమైన యాక్టింగ్‌ కనబరిచే ప్రయ త్నం చేసింది. రాము స్నేహితుడి పాత్రలో దీపక్, ఆశ స్నేహితురాలి పాత్రలో శ్రావ్య ఒకే. దీపక్‌ కామెడీ సీన్స్‌ ఓ మాదిరిగా ఉన్నాయి. తండ్రి పాత్రలో అజయ్‌ తన అనుభవమైన నటనను చూపించారు. శరణ్య ప్రదీప్‌ తన పాత్ర పరిధి మేరకు నటించారు. రాజ్‌కుమార్‌ కసిరెడ్డి కాస్త నెటగివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్‌ చేశాడు. గుహన్‌ విజువల్స్, విజయ్‌ బుల్గానిన్‌ మ్యూజిక్‌ ఒకే. దర్శకుడిగా రమేష్, రైటర్‌గా నందులు తమ పూర్తి ఎఫర్ట్స్‌ పెట్టలేనట్లున్నారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బాటమ్‌లైన్‌: సందేశాత్మక తెల్లకాగితం

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu