కమల్‌హాసన్‌నే మించిపోయిన యోగిబాబు

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
1 Min Read

Web Stories

Yogi Babu 16 roles: ‘దశావతారం’ సినిమా గుర్తుంది కదా! ఈ చిత్రంలో కమల్‌హాసన్‌ ఒక్కరే పది పాత్రలు పోషిస్తే, ఆడియన్స్‌ అబ్బురపడ్డారు. యాక్టర్స్‌ ఔరా అంటూ ఆశ్చపోయి, ముక్కున వేలేసుకున్నారు. కానీ తమిళ హాస్యనటుడు యోగిబాబు కమల్‌హాసనే మించి పోయేలా ఓ పని చేస్తున్నారు. ఒకే సినిమాలో ఏకంగా పదహారు పాత్రలు పోషించనున్నారు యోగిబాబు.

ప్రభుదేవా, అర్జున్‌ అశోకన్, యోగిబాబు, అజువర్గీస్‌ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ‘మూన్‌వాక్‌’ అనే సినిమా డిసెంబరు 24న (Moonwalk Movie Release date) రిలీజ్‌ కానుంది. మనోజ్‌ ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రంలోనే యోగిబాబు 16 పాత్రలు పోషిస్తున్నారు. విశేషం ఏంటంటే… ఇందులో లేడీ గెటప్‌ కూడా వేశారు యోగిబాబు. కొన్ని సన్నివేశాల్లో భార్యాభర్తలు….ఇద్దరిగా యోగిబాబే కనిపిస్తారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను రివీల్‌ చేయ డంతో, ఇందులో యోగిబాబు లేడీ గెటప్‌తో కూడా కనిపిస్తుండటం తెలుస్తోంది.

ఇక ఈ ‘మూన్‌వాక్‌’ (MoonWalk Movie) సినిమా కోసం దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత ప్రభుదేవా, ఏఆర్‌ రెహమాన్‌ కలిసి పనిచేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో ‘మెరుపు కలలు’ అనే సినిమా వచ్చింది. అన్నట్లు మరోమాట..‘మూన్‌వాక్‌’ సినిమాకు సంగీతం అందించడంతో పాటుగా, ఇందులో ఓ గెస్ట్‌ రోల్‌ చేశారు ఏఆర్‌ రెహమాన్‌. ఏ యాంగ్రీ డైరెక్టర్‌గా కనిపిస్తారట ఏఆర్‌ రెహమాన్‌.

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah