Robert Pattinson : జేమ్స్‌బాండ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ జేమ్స్‌బాండ్ ( James Bond Movies) ఫ్రాంచైజీ నుంచి ఇప్పటివరకు 25 సినిమాలు వచ్చాయి. 25వ సినిమా తర్వాత ఈ జేమ్స్‌బాండ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాల ఫ్రాంచైజీ క్లోజ్ అవుతుందని అందరు అనుకున్నారు. డేనియల్ క్రేయిగ్ అనే అఖరి జేమ్స్‌బాండ్ అని కథనాలు కూడా వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం కొత్త జేమ్స్‌బాండ్ కోసం సైలెంట్‌గా అన్వేషణ ప్రారంభించారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత న్యూ జేమ్స్‌బాండ్‌గా పలువురు యువ హాలీవుడ్ కథానాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ న్యూ జేమ్స్‌బాండ్‌గా అవతరించాడు. తన 40 ఏళ్ల వయసులో రాబర్ట్ ప్యాటిన్సన్ జేమ్స్‌బాండ్‌గా స్క్రీన్‌పై కనిపించనుండటం విశేషం.
నా తప్పులు తెలుసుకున్నాను: హీరోయిన్ శ్రీలీల

జేమ్స్‌బాండ్ సిరీస్‌లోని కొత్త సినిమా జేమ్స్‌బాండ్ 26వ సినిమాకు డెనిస్ విల్లెన్యూవ్ దర్శకత్వం వహిస్తారు. 2027లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. 2028లో ఈ సినిమా విడుదల అవుతుంది. మరోవైపు తాజాగా జేమ్స్‌బాండ్ అవకాశాన్ని చేజిక్కిచుకున్న రాబర్ట్ ప్రజెంట్ బ్యాట్‌మేన్‌గా కూడ నటిస్తుండటం విశేషం. అలాగే వెండితెరపై కనిపించనున్న ఆరో జేమ్స్‌బాండ్ ప్యాటిన్సన్. గతంలో వెండితెరపై జేమ్స్బాండ్స్గా సీన్ కానరీ (Sean Connery), జార్జ్ లేజెన్బీ (George Lazenby), రోజర్ మూర్ (Roger Moore), తిమోతి డాల్టన్ (Timothy Dalton), పియర్స్ బ్రాస్నన్ (Pierce Brosnan), డేనియల్ క్రెయిగ్ (Daniel Craig) నటించారు. ఏడో జేమ్స్‌బాండ్‌గా రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson) నిలిచాడు.