Sreeleela: ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ, బిజీగా హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు శ్రీలీల. ఒక దశలో ఆమె టాప్ హీరోయిన్గా నిలిచారు. కానీ టాలీవుడ్లో శ్రీలీల చేసిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకే తరహా రోల్స్ చేయడంతో తెలుగు ఆడియన్స్ శ్రీలీల (Sreeleela) కథల ఎంపికను తప్పుపట్టారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఒక్కటంటే ఒక్కటీ తెలుగు సినిమా లేదు. అయితే ఇప్పుడు తన తప్పులను తాను తెలుసుకున్నానని అంటున్నారు శ్రీలీల. తాను రోటీన్ రోల్స్ చేయడంపై ధనుష్ ‘ఓం’ సినిమా ప్రీ రిలీజ్ వేదికగా శ్రీలీల స్పందించారు.
చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను!
“నా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చాను. ఒక ఫ్లోలో నాకు అవకాశం వచ్చిన సినిమా అల్లా చేసుకుంటు వెళ్లాను. అయినా తెలుగు అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులు నాపై ప్రేమచూపిస్తూనే ఉన్నారు. ఇందుకు నేను వారికి రుణపడి ఉంటాను. నా మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నుంచి నా మెడిసన్ పూర్తి అయ్యే వరకు ఇప్పటి వరకు నేను చేయాల్సిన సినిమాలు చేశాను. నా చదువు పూర్తయిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిం చుకుంటే, నా తప్పులు నాకు తెలుసొచ్చాయి. నా గురించి నేను నేర్చుకోవాల్సింది ఏమిటి? అని తెలిసి సోచ్చింది. ఇక పై కొత్త శ్రీలీలను చూస్తాను. నా సరికొత్త నిర్ణయాలతో ప్రారంభం కాబోయే నా కొత్త జర్నీని కూడా ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అని శ్రీలీల ఓకింత భావోద్వేంగా మాట్లాడారు. ఇక ఇదే ఈవెంట్లో శ్రీలీలను ప్రశంసిస్తూ, ఇకపై ఆమెను కొత్తగా ఆడియన్స్ చూస్తారని సాయిపల్లవి చెప్పడం విశేషం.

మూడు తమిళ సినిమాలు
ప్రస్తుతం శ్రీలీల తమిళంలో చేసిన ‘ఓం’ సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతుండగా, అజిత్ ‘డేర్ డేవిల్’, రజనీకాంత్ ‘ధర్మన్’ సినిమాల్లో శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తోంది. అలాగే రెండు హిందీ చిత్రాల్లోనూ నటిస్తోంది ఈ తెలుగు బ్యూటీ.