పెద్ది డైరెక్టర్ కి ప్రభాస్ బంపర్ ఆఫర్..?

Kumar NA
2 Min Read

Web Stories

Prabhas bumper offer two peddi director : తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసి, సుకుమార్ శిష్యుడిగా తన సత్తా చాటాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో ‘పెద్ది’ అనే భారీ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇంకా సెట్స్‌పై ఉండగానే బుచ్చిబాబుకు టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి పిలుపు వచ్చిందన్న వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో సెన్సేషన్‌గా మారింది.

ప్రభాస్ ప్రస్తుతం ‘స్పిరిట్’, ‘కల్కి-2’, ‘ఫౌజీ’, ‘సలార్-2’ వంటి భారీ చిత్రాలతో అత్యంత బిజీగా ఉన్నాడు. ఇటీవల విడుదలైన ‘ది రాజా సాబ్’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఆ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు మరో అవకాశం ఇవ్వాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రభాస్ మరో ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.


ఈ కొత్త ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసే బాధ్యతను బుచ్చిబాబు సానాకు అప్పగించే యోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో చేస్తున్న ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ మూవీ పనులు పూర్తయిన వెంటనే బుచ్చిబాబు ప్రభాస్ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టే అవకాశం ఉందని టాక్. ఈ క్రేజీ కాంబో 2027లో పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ బడ్జెట్‌తోనే రూపొందనుందని సమాచారం. అయితే ఇది ఏ జోనర్ సినిమా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈసారి ప్రభాస్‌తో తీయబోయే సినిమా విషయంలో ఎక్కడా తగ్గకుండా, చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తోందట. మరి బుచ్చిబాబు మార్క్ ఎమోషన్స్, ప్రభాస్ మాస్ ఇమేజ్‌తో తోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయో చూడాలి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు, కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడే ఈ కాంబినేషన్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు.

Please Share
Share This Article
3 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu