ఆ సినిమాలో బ్లైండ్‌…ఈ సినిమాలో డెఫ్‌..యంగ్‌ హీరోయిన్‌ చాలెంజింగ్‌ రోల్స్‌

Viswa
1 Min Read

Web Stories

Anaswara Rajan in Kaaka Movie: టాలీవుడ్‌ ట్రెండీ హీరోయిన్‌ అనస్వర రాజన్‌ (Anaswara Rajan ) మరోసారి చాలెంజింగ్‌ రోల్‌ చేయ బోతున్నారని తెలుస్తోంది. మలయాళంలో హీరో మోహన్‌లాల్, దర్శకుడు జీతూమాధవన్‌ కాంబినేషన్‌ అంటే వెంటనే అందరికీ ‘దృ శ్యం’ సిని మాలు గుర్తుకు వస్తాయి. కానీ మోహన్‌లాల్‌–జీతూమాధవన్‌ కాంబినేషన్‌లోనే ‘ట్వల్త్‌మేన్‌’, నేరు’ వంటి సినిమాలు వచ్చాయి. 2023లో వచ్చి మలయాళ సినిమా ‘నేరు’లో మోహన్‌లాల్, ప్రియమణిలతో పాటుగా, అనస్వరరాజన్‌ ఓ లీడ్‌ రోల్‌ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే…ఈ సినిమాలో అనస్వర రాజన్‌నే మెయిన్‌ లీడ్‌ రోల్‌ అన్నమాట. 2023లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమాలో రేప్‌ (లైంగికదాడి)కి గురి కాబడిన బ్లైంగ్‌ గర్ల్‌గా అనస్వర నటించారు. ఇందులో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇప్పుడు మళ్లీ ఈ తరహా రోల్‌నే అనస్వర రాజన్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవి హీరోగా తెలుగులో ‘కాకా’ అనే సినిమాను దర్శకుడు బాబీ తీస్తున్నారు. ఈ సినిమాలో డాక్టరు అమ్ములు పాత్రలో అనస్వర నటిస్తారు. అయితే కథ రిత్యా అమ్ములు మాట్లాడలేదని తెలిసింది. పుట్టుక తోనే మూగగా ఉం టుందా? లేక ఏదైనా రివెంజ్‌ ఫైట్‌లో ఆమెకు అన్యాయం జరుగుతుందా? అనేది చూడాలి. ఇక ‘నేరు’లో చాలెంజింగ్‌ రోల్‌ చేసిన అనస్వర, ఇప్పుడు మళ్లీ మాట్లాడలేని రోల్‌ చేస్తుండటం విశేషం.

మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే…ఒకవైపు ప్రయోగాత్మక రోల్స్‌ చేస్తూనే, మరోవైపు కమర్షియల్‌ రోల్స్‌ చేస్తూ ఆడియన్స్‌ను చేరువ అవుతున్నారు అనస్వర. ఇటు హీరోయిన్‌గా, అటు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ సినిమాలు చేస్తూ కెరీర్‌ను స్ట్రాంగ్‌గా బిల్డప్‌ చేసుకుంటున్నారీయంగ్‌ బ్యూటీ.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah