సంక్రాంతికి వస్తున్నాడు కాకా

Viswa
1 Min Read

Web Stories

Chiranjeevi new film titled as kaakaa: చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి కెరీర్‌లోని ఈ 158వ సినిమాలో అనశ్వరరాజన్, నివేతాపేతురాజ్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తు న్నారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌ నేపథ్యంతో సాగే ఈ సినిమాలో చిరంజీవి కుమార్తెగా అనశ్వర, ఆయన భార్యగా నివేతాపేతురాజ్‌ నటిస్తున్నట్లుగా తెలిసింది.

ఇక ఈ సినిమాకు ‘కాకా’ (కదిరి కాకాజీ) అనే టైటిల్‌ను మేకర్స్‌ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 22న చిరంజీవి బర్త్‌ డే. ఈ సందర్భంగా ‘కాకా’ సినిమాను గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్న ట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 40 రోజులు పూర్తయింది. ఇటీవల ముగిసిన హైదరా బాద్‌ సెట్‌లో ఓ స్పెషల్‌ సాంగ్‌ను మేకర్స్‌ చిత్రీకరించారని తెలిసింది. అలాగే ఈ సినిమాలో వర్షం బ్యాక్‌ డ్రాప్‌తో వచ్చే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించారు మేకర్స్‌. ఒకవైపు షూటింగ్‌ చేస్తూనే, మరో వైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులపై కూడా ఫోకస్‌ పెట్టారు దర్శకుడు బాబీ. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌ ఎడిట్‌ను ఆల్మోస్ట్‌ పూర్తి చేసినట్లుగా యూనిట్‌ పేర్కొంది.

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెంకట్‌ కె.నారాయణ నిర్మిస్తున్న ఈ ‘కాకా’ సినిమా వచ్చే సంక్రాంతి సంద ర్భంగా థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌ తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu