ఆకాశంలో ఒక తార సినిమా రివ్యూ – భార్య కల..భర్త నమ్మకం

Viswa
4 Min Read

Web Stories

Aakasamlo Oka Tara Movie review: మలయాళ నటుడు దుల్కర్‌సల్మాన్‌కు తెలుగు సినిమాల విషయంలో మంచి క్రేజ్‌ ఉంది. దుల్కర్‌ యాక్ట్‌ చేసిన తెలుగు సినిమాలు ‘మహానటి’, ‘సీతారామం’, ‘లక్కీభాస్కర్‌’ సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. ‘లక్కీ భాస్కర్‌’ మినహాయిస్తే…‘మహానటి’, ‘సీతారామం’ సినిమాల్లో హీరోయిన్‌ పాత్రే సెంటర్‌ ఆఫ్‌ ఏట్రా క్షన్‌గా ఉంటుంది. ఈ తరహా కథతోనే రూపొందిన ‘ఆకాశంలో ఒక తార’ (Aakasamlo Oka Tara Movie) సినిమాలో దుల్కర్‌సల్మాన్‌ హీరోగా నటించగా, హీరోయిన్‌గా సాత్విక వీరవల్లి యాక్ట్‌ చేశారు. సాత్విక వీరవల్లికి హీరోయిన్‌గా ఇదే తొలి సినిమా. మరి..ఆకాశంలో ఒక తార సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అన్నది రివ్యూలో (Aakasamlo Oka Tara Movie review)  చూద్దాం.

సినిమా ఆకాశంలో ఒక తార
ప్రధాన నటీనటులు దుల్కర్‌సల్మాన్‌, సాత్విక వీరవల్లి, శ్రుతీహాసన్‌, రుహాణీశర్మ
దర్శకత్వం పవన్‌సాధినేని
నిర్మాతలు సందీప్‌గుణ్ణం, రమ్య గుణ్ణం, అల్లు అరవింద్‌, స్వప్నాదత్‌
సంగీతం జీవీ ప్రకాష్‌కుమార్‌
కెమెరా సుజిత్ సారంగ్
ఎడిటింగ్‌ కేఎల్‌ ప్రవీణ్‌
నిడివి 2 గంటల 39 నిమిషాలు
సెన్సార్‌ యూ బై ఏ (13 ఫ్లస్‌)
విడుదల తేదీ 20-11-2026
రేటింగ్‌ 3/5

కథ

ఓ మారుమూల పల్లెటూరిలోని ఒక సాధారణ పేద కుటంబంలోని అమ్మాయి కల్పన. అంతరిక్షంలోకి వెళ్లాలన్నది కల్పన కల. కానీ పదహారు సంవత్సరాల వయసులోనే కల్పనకు ఆమె తండ్రి పెళ్లి చేస్తాడు. కల్పన భర్త కృష్ణ (దుల్కర్‌ సల్మాన్‌) మంచి వ్యక్తిత్వం గల వాడు. కల్పన కలను నిజం చేసేందుకు ఆమెను బాగా చదివిస్తాడు. కల్పన కూడా బాగా చదువుకుంటుంది. అయితే కల్పన చేసిన ఒక ప్రయోగం విఫలం అవుతుంది. దీంతో అంతరిక్షంలోకి వెళ్లాలి, అస్ట్రోనాట్‌ కావాలన్న తన కలను తానే అడ్డుగోడ కట్టు కుంటుంది. మరి…ఆ తర్వాత ఏం జరిగింది? కల్పన మనసు ఎలా మారింది? కల్పనకు ఆమె భర్త కృష్ణ ఏ విధంగా సహాయం చేశాడు? భార్యభర్తలు కల్పన–కృష్ణ జీవితాల్లోకి వచ్చిన రోహిణి (శ్రుతీహాసన్‌) ఎవరు? అన్నది మిగిలిన కథ (Aakasamlo Oka Tara Movie story).

విశ్లేషణ

అందరు కలలు కంటారు. వాటిని నిజం చేసుకోవడానికి కొందరే కష్టపడతారు. అలా కష్టపడిన ఓ పల్లెటూరి అమ్మాయి కథే ఈ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా. ఇలా చెప్పడం కంటే కూడా…ఒక అమ్మాయి కల నిజం కావడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులు, భర్త, సమాజం ఏలాంటి తోడ్పాటును, సహాయాన్ని అందించాలో చాటిచెప్పే స్ఫూర్తిదాయకమైన కథ ఇది.

ఈఎన్‌ఈ రిపీట్‌ రివ్యూ…హిట్‌ సినిమా తీసే ఛాలెంజ్‌

Aakasamlo Oka Tara Movie review and rating

కల్పన అంతరిక్షంలోకి వెళ్లాలని కల కనడం, ఆమెకు పెళ్లికావడం, కృష్ణ సపోర్ట్‌ చేయడం, ఆమె చేసిన ఓ ప్రయోగం విఫలం కావడం…వంటి సన్నివేశాలతో ఫస్ట్‌హాఫ్‌ సాగుతుంది. కల్పన–కృష్ణల పెళ్లి సీన్స్, వివాహం తర్వాత తొలిసారి వీరి మధ్యలో జరిగే సంభాషణలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా కల్పన నిరుత్సాహ పడిపోయినప్పడు కృష్ణ ఆమెకు తోడుగా నిలిచి, తనలో స్ఫూర్తిని రగిలేలా చేయడం, కల్పన జీవితంలోకి రోహిణీ రావడం…వంటి సన్నివేశాలతో సెకండాఫ్‌ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ సన్ని వేశాలూ బాగానే ఉంటాయి. అయితే కల్పన చేసిన ప్రయోగాలు ఎక్కడ విఫలం అవుతున్నాయి? కల్పన నమ్మిన ఫ్లాస్మా థియరీలో తప్పు ఎక్కడ ఉంది? ఎలా రెక్టిఫై చేసుకోగలిగింది? అన్న టెక్నికల్‌ డీటైలింగ్‌ ఇంకాస్త వివరంగా ఉంటే బాగుంది. శంకర్‌నారాయణ (మురళీ శర్మ) పాత్ర కాస్త ఫోర్డ్స్‌గా అనిపించింది. కొన్ని సాగదీత సన్నివేశాలు ఉన్నాయి. ఒకే అంశం గురించి భార్యభర్తల మధ్య జరిగే సంభాషణలు వంటివి (Aakasamlo Oka Tara Review).

నటీనటుల పెర్ఫార్మెన్స్‌


కృష్ణ పాత్రలో దుల్కర్‌సల్మాన్‌ బాగా నటించాడు. ఈ పాత్రకు తానే కరెక్ట్‌ అని ప్రేక్షకులు అనుకునేంత బాగా యాక్ట్‌ చేశాడు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌లో తనదైన నటనతో దుల్కర్‌ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాడు. క ల్పన పాత్రలో సాత్విక వీరవల్లి చక్కగా నటించింది. అసలు..సాత్వికకు నిజంగా ఇది తొలి సినిమానేనా? అనే సందేహం వచ్చేంత బాగా యాక్ట్‌ చేసింది సాత్విక. భార్యభర్తల మధ్య సన్నివేశాల్లో మెచ్యూర్డ్‌గా, అంతరిక్షంలోకి వెళ్లాలనే కల ఉన్న అమాయకత్వపు అమ్మాయిల, ప్రయోగం ఫెయిల్‌ అయినప్పుడు కన్నీరు కార్చిన సైంటిస్ట్‌…ఇలా భిన్నభావోద్వేగాల్లో సాత్విక నటన మెచ్చుకోదగినదిగా ఉంటుంది. కృష్ణ అక్కయ్య బిజిలీగా రుహానీశర్మ, ఏరోస్పేస్‌ సైంటిస్ట్‌ రోహిణీగా శ్రుతీహాసన్, మరో సైంటిస్ట్‌ శంకర్‌నారాయణగా మురళీశర్మ, గౌతమ్‌వాసుదేవ్‌మీన్, నాజర్‌…వారి వారి పాత్రల్లో నటించారు. (Aakasamlo Oka Tara Movie cast and crew)

Aakasamlo Oka Tara Movie

టెక్నికల్‌గా కూడా ఈ సినిమా బాగుంటుంది. ముఖ్యంగా జీవీ ప్రకాష్‌కుమార్‌ మ్యూజిక్‌ మ్యూజిక్‌ చేసినట్లు ఉంది. సాంగ్స్, ఆర్‌ఆర్‌ బాగున్నాయి. దర్శకుడు పవన్‌సాధినేని డైలాగ్స్, గుణ్ణం గంగరాజు–పవన్‌ల స్క్రీన్‌ ప్లే ఒకే. విజువల్స్‌ బాగున్నాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బాటమ్‌లైన్‌: పట్టదేల ఆయుధం…నమ్మకమే స్ఫూర్తి. ఒక మంచి ఇన్‌స్ఫైరింగ్‌ సినిమా ఇది. అంతకుమించి భార్యభర్తల మధ్య ఉండాల్సిన మంచి అనుబంధాలకు నిదర్శనం ఈ సినిమా.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah