నిమిషానికి కోటి.. రెమ్యూనరేషన్ లో తమన్నా నయా రికార్డ్!

Kumar NA
2 Min Read

Web Stories

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అలరించిన ఈ భామ, ఇప్పుడు ‘స్పెషల్ సాంగ్స్’కు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ఆమెకున్న క్రేజ్ చూస్తుంటే, ఇతర ఐటెం సాంగ్ తారలకు అవకాశాలు దొరకడం గగనంగా మారుతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

తమన్నా డాన్స్ స్టెప్పులకు ప్రస్తుతం ఉన్న డిమాండ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తాజాగా జరిగిన ఒక ప్రైవేట్ ఈవెంట్‌లో తమన్నా కేవలం 6 నిమిషాల పర్ఫామెన్స్ కోసం ఏకంగా రూ. 6 కోట్లు వసూలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే నిమిషానికి కోటి రూపాయల అన్నమాట. ఆమె స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలో కూడా ఒక పూర్తి సినిమాకు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుని ఉండదు. కానీ ఇప్పుడు కేవలం ఒక పాట లేదా స్టేజ్ పర్ఫామెన్స్‌తో కోట్లు గడిస్తోంది. రజినీకాంత్ ‘జైలర్’లో “నువ్వు కావాలయ్యా” పాటతో మొదలైన ఈ జోరు, బాలీవుడ్ చిత్రం ‘స్త్రీ 2’లోని “ఆజ్ కీ రాత్” పాటతో పీక్స్‌కు చేరింది. తమన్నా క్రేజ్ ఎంతలా పెరిగిందంటే, ఆమె ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తే మెయిన్ హీరోయిన్ కంటే తనకే ఎక్కువ పబ్లిసిటీ వస్తోంది.

ఇదే కారణంతో ‘ధురంధర్’ చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్, తమన్నాతో పాట వద్దనుకున్నారట. తమన్నా డాన్స్ వల్ల సినిమాలోని అసలు కథ డైవర్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడటం విశేషం. తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిన తమన్నాకు, ఇప్పుడు ఇక్కడ కథానాయికగా అవకాశాలు తగ్గాయి. టాలీవుడ్ మేకర్లు ఆమెను హీరోయిన్ పాత్రలకు పెద్దగా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అయితే, నార్త్ ఆడియెన్స్ మాత్రం ఆమెను గ్లామరస్ రోల్స్ మరియు స్పెషల్ సాంగ్స్‌లో చూడటానికే మొగ్గు చూపుతున్నారు. మొత్తం మీద తమన్నా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంది. భాషతో సంబంధం లేకుండా కేవలం తన డాన్స్ మరియు గ్లామర్‌తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu