హీరో మహేశ్‌బాబు (Maheshbabu), దర్శకుడు రాజమౌళి (SSRajamouli) కాంబోలో అంతర్జాతీయ స్థాయిలో ఓ మూవీ రానుంది (MaheshBabuSSMB29 new update). ఈ సిని మా షూటింగ్ (SSMB29) శరవేగంగా జరుగుతోంది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో, రెండో షెడ్యూల్‌ను ఒడిస్సాలో చేశారు మేకర్స్. లేటెస్ట్‌గా మూడో షెడ్యూల్ షూటింగ్‌ను హైదరాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో చిత్రీ కరించాలని రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేశారు.
భారీ యాక్షన్ సీక్వెన్స్ ఇది. మూడువేల మందికిపైగా ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో పార్ట్ కానున్నట్లుగా తెలిసింది. నెల రోజు లకుపైనే, ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతుందని తెలిసింది. బోటు చేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. ఈ షెడ్యూల్‌తో ఈ మూవీ చిత్రీకరణ దాదాపు 40 శాతం పూర్తవుతుందట. చూస్తుంటే..ఈ మూవీ షూటింగ్‌ను అంతా ఇండియన్ లోకేషన్స్, సెట్స్‌లోనే కంప్లీట్ చేసేలా ఉన్నారు మహేశ్‌బాబు అండ్ రాజమౌళి.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు…విదేశాల్లో ఈ మూవీ షూటింగ్ ఎక్కువగా జరుగుతుందనే ప్రచారం సాగింది. కేన్యా, ఆఫ్రికా దేశాల్లో లొకేషన్స్‌ను కూడా చూసొచ్చారు రాజమౌళి. కానీ ప్రస్తుతం ఈ సినిమా మేజర్ షూటింగ్ అంతా ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.
దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు. బడ్జెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి… మరో అంతర్జాతీయ స్టూడియో ఏదైనా ఈ మూవీ నిర్మాణంలో భాగం కానుందనే ప్రచారం సాగింది. ఈ విషయంపై ఇప్పటివరకు అప్‌డేట్ లేదు.
కాకపోతే….ఈ సినిమాకు మహేశ్‌బాబు, రాజమౌళి పారితోషికం తీసుకోవడం లేదని, వచ్చే లాభాల్లో వాటాలు తీసుకుంటారనే టాక్ కూడా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. బహుశా..అందుకెనెమో… ఖర్చు ఎక్కువగా కాకుండ ఇండియా లోకేషన్స్, సెట్స్‌లోనే ఈ మూవీని పూర్తి చేసి, 2027లోనే ఈ మూవీని రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌సుకుమారన్‌లు ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త. విజయేంద్రప్రసాద్ ఈ ఆఫ్రికన్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్‌కి కథ అందించారు. విజయేంద్రప్రసాద్, దేవకట్టాలు కలిసి ఈ సినిమాకు సంభాషణలు ఇస్తున్నారు.
I have been browsing online greater than 3 hours lately, but I by no means found any attention-grabbing article like yours. It is pretty worth sufficient for me. In my view, if all web owners and bloggers made excellent content material as you probably did, the internet shall be a lot more helpful than ever before. “When you are content to be simply yourself and don’t compare or compete, everybody will respect you.” by Lao Tzu.