Sankranthiki Vasthunam Sequel : ‘ఎఫ్2, ఎఫ్3’ వంటి చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్‌రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టింది. 2025 సంక్రాంతికి థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్ల రూపాయాల కలెక్షన్స్ సాధించింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ మీట్‌లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు సీక్వెల్‌గా (‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’గా ప్రచారం జరుగుతోంది) ఉండొచ్చని, 2026 సంక్రాంతికి లేదా 2027 సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్ రిలీజ్ కావొచ్చని వెంకటేశ్ చెప్పారు (telugumovie news).
2026 సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సీక్వెల్ అయితే రాలేదు. చిరంజీవితో అనిల్ రావిపూడి తీసిన ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా సంక్రాంతికి విడుదలైతే, ఇందులో వెంకటేశ్ ఓ కీలక పాత్ర చేశారు. అయితే 2027 సంక్రాంతికి ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ సినిమా ఉండొచ్చనే కొన్ని ఊహాగానాలు ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి (latest telugu cinema news). కానీ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్ ‘సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ (Sankranthiki Vasthunam Sequel)ఆల్మోస్ట్ ఉండకపోవచ్చని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు (Director AnilRavipudi Onterview).
‘‘రీమేక్స్, సీక్వెల్స్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. చెప్పిన కథను మళ్లీ ఆడియన్స్‌కు చెప్పాలంటే నాకు ఒకే ఇంట్లో తిరిగుతున్నట్లుగా ఉంటుంది. కొందరు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌ను ఊహిస్తున్నారు. నాకైతే ఇప్పటివరకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్‌పై ఆలోచనలు లేవు. భవిష్యత్‌లో ఏమో చెప్పలేను’ అని చెప్పారు అనిల్ రావిపూడి. దీంతో పరోక్షంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సీక్వెల్ ఇక ఉండదని అనిల్‌రావిపూడి పరోక్షంగా చెప్పినట్లే తెలుస్తుంది (Sankranthiki Vasthunam Sequel upadte).
ఇక ప్రస్తుతం తాను ‘మనశంకరవరప్రసాద్‌గారు’ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నానని అనిల్‌రావిపూడి చెప్పారు. ఇంకా ‘మనశంకరవర ప్రసాద్‌గారు’ సినిమా సక్సెస్‌టూర్‌తో తన కొత్త సినిమా గురించి ఓ ఐడి యా వచ్చిందని, త్వరలోనే టైటిల్‌తో సహా అనౌన్స్‌చేస్తామని ఆయన చెప్పారు. ఈ సినిమా ఓ విచిత్రమైన జర్నీ అని కూడా పేర్కొన్నారు (upcomeing telugu movies). ఇంకా థియేటర్స్‌లో ప్రేక్షకుల చిరునవ్వే తన సక్సెస్‌సీక్రెట్ అని కూడా తెలిపారు అనిల్ రావిపూడి (latest telugu movies).