Raaka guinnes world Record: ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో ‘రాకా’ (Raaka) సినిమాకు చోటు లభించింది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఏకకాలంలో 37 మంది ఆర్టిస్టుల యాక్టింగ్‌ను చిత్రీకరించినందుకు ‘రాకా’కు ఈ అవార్డు వరించింది (Raaka guinnes world Record). 92 ఆఫ్టికల్ మోషన్ క్యాప్చర్ కెమెరాలను వినియోగించారు. క్యాప్చర్, క్యాలిబ్రేషన్, రియల్ టైమ్ ఆన్ విజువ లైజేషన్, ఫేషియల్ క్యాప్చర్, సింక్రనైజేషన్ వంటి అత్యాధునిక సాంకేతిక నెట్వర్క్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక ఈ సీక్వెన్స్ చిత్రీకరణలో పాల్గొన్న 37 మంది ఆర్టిస్టుల్లో, 4 ఏళ్ల వ్యక్తి నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న కళాకారులూ ఉండటం విశేషం. ఇక ఈ సీక్వెన్స్‌ను ‘రాకా’ టీమ్ ఫిబ్రవరిలో చిత్రీకరించగా, సెప్టెంబరు 15న గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు బృందం అధికారికంగా గుర్తించి, ‘రాకా’ సినిమా హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీలకు గిన్నిస్ సర్టిఫికేట్‌ను అందించింది. ఈ విషయాలను 2026 సెప్టెంబరు 21న మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ ఘనత పట్ల అల్లు అర్జున్ స్పందిస్తూ….ఈ ఘనత ఇండియన్ సినిమాకు గ్లోబల్ స్థాయిలో ఓ బెం^Œ మార్క్‌గా నిలిచిపోతుందని, ఈ రికార్డు సాధనకు కృషి చేసిన ‘రాకా’ టీమ్ అందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. ‘‘చిన్నప్పుడు గిన్నిస్ రికార్డులను గురించి విన్నప్పుడు ఆశ్చర్యపో యేవాళ్లం. ఒకనాడు మేము కూడా ఈ ఘనతను సాధిస్తామని అప్పుడు ఊహించలేకపోయాం. ఇప్పుడు సాధించినందుకు చాలా గర్వంగా ఉంది. టీమ్ అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీపికా పదుకొనె ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, రష్మికామందన్నా, జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్లు ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారని తెలిసింది. రమ్యకృష్ణ, యోగిబాబు, జిమ్ సర్భ్లు ఈచిత్రంలోని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. అయితే ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. ‘రాకా’ సినిమా 2027 చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.