ది ప్యారడైజ్‌ మూవీ ఫస్ట్ రివ్యూ…సవారీల తిరుగుబాటు

Viswa
2 Min Read
nani The Paradise First Review

Web Stories

TheParadise First Review: ‘దసరా’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో ప్రేక్షకుల ముం దుకు వస్తున్న తాజా సినిమా ‘ది ప్యారడైజ్‌’. ఈ సినిమా ఈ నెల 24న (TheParadise Movie Release date) విడుదల కానుంది. ఒకరోజు ముందు గానే..అంటే సెప్టెంబరు 23నే ఈ సినిమా ప్రీమియర్స్‌ను ప్రదర్శించనున్నారు మేకర్స్‌. మరి..ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు జరిగిన ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో ‘ది ప్యారడైజ్‌’ సినిమా టీమ్‌..ఈ సినిమా కథను గురించి ఎలాంటి విశేషాలు చెప్పారు…ఈ మూవీ ఎలా ఉండబోతుంది? అనే అంశాలపై మీరూ ఓ లుక్‌ వేయండి (Nani The Paradise Movie Review).

కథ ఏంటి? (TheParadise story)

1984–1985 టైమ్‌లైన్‌తో సాగే, పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ది ప్యారడైజ్‌’ (The Paradise move first Review)సినిమా. ఒక సంచార జాతి అయిన సవారీ తెగ తమ ఉనికి, అస్థిత్వం, హక్కుల కోసం చేసే తిరుగుబాటు నేపథ్యంతో ఈ సినిమా కథ నం సాగుతుంది. ఈ సవారీ తెగ నాయకుడు, సికింద్రబాద్‌ కుర్రాడు జడల్‌ పాత్రలో నాని నటించారు. యాక్షన్‌ మూవీగా కనిపి స్తున్నా…ఈ సినిమాలో తల్లీకొడుకుల బలమైన ఎమోషన్‌ ఉంది. మరోవైపు గతం లో వచ్చిన ప్రభాస్‌ ‘ఛత్రపతి’, రామ్‌చరణ్‌ ‘పెద్ది’, విజయ్‌దేవరకొండ ‘కింగ్‌డమ్‌’ సినిమాల ఛాయలు ‘ది ప్యారడైజ్‌’ సిని మాలో కనిపిస్తాయని సమాచారం. ముఖ్యంగా ‘ఛత్రపతి’ సినిమాలా ఉంటుందట ‘ది ప్యారడైజ్‌’ సినిమా. (The Paradise Movie Review)

ఎవరు ఎవరు ఏ ఏ పాత్రలు చేశారు? (The Paradise Cast and Crew)

మెయిన్‌ విలన్‌ శిఖంజా మాలిక్‌గా మోహన్‌బాబు, శిఖంజామాలిక్‌ తనయుడు విక్రమ్‌ మాలిక్‌గా రాఘవ్‌ జుయల్‌ నటించారు. నాని లవర్‌ సుబ్బుగా కయాదులోహర్‌ కనిపిస్తారు. జడల్‌ తల్లి పాత్రలో సమ్మక్కగా సోనాలీ కులకర్ణి నటించారు. జడల్‌ ఫ్రెండ్‌ బిర్యానీగా సంపూర్ణేష్‌బాబు కనిపిస్తారు.

ఆరు పాటలు..నాలుగు ఫైట్స్‌ (The Paradise movie songs)

ఈ సినిమాలో ప్రధానంగా నాలుగు ఫైట్స్‌ ఉన్నాయి. రామ్‌–లక్ష్మణ్‌ మాస్టర్స్‌ రెండు యాక్షన్‌ బ్లాక్స్‌ కంపోజ్‌ చేయగా, రియల్‌ సతీస్‌ మాస్టర్, నబాకాంత్‌ మాస్టర్స్‌…చెరో యాక్షన్‌ సీక్వెన్స్‌ను కంపోజ్‌ చేశారు.

బిట్‌సాంగ్స్‌తో కలిపి మొత్తం ‘ది ప్యారడైజ్‌’ సినిమాలో ఆరు పాటలు ఉంటాయి. ‘ఆయా షేర్‌’, స్పెషల్‌ సాంగ్‌ ‘ఏషనాగుల’, హీరో–హీరోయిన్ల మధ్య ఉండే లవ్‌సాంగ్‌ ‘అంజానా అంజానీ’, తల్లిసెంటిమెంట్‌తో వచ్చే ‘సమ్మక్క..’ సాంగ్స్‌ ఆల్రెడీ రిలీజ్‌ అయ్యాయి. మరో రెండు సాంగ్స్‌ ఆడియన్స్‌ను థియేటర్స్‌లో సర్‌ప్రైజ్‌ చేయబోతున్నాయి.

‘ది ప్యారడైజ్‌’ సినిమా నిడివి 2 గంటల 49 నిమిషాలు ఉంటుంది. సెన్సార్‌ వాళ్ళు ‘ఏ’ సర్టిఫికేట్‌ జారీ చేశారు. ఈ సినిమాకు దాదాపు 200 కోట్ల రూపాయల మేర బిజినెస్‌ జరిగిందనే టాక్‌ వినిపిస్తోంది. దా దాపు 180 కోట్ల (the Paradise Film Budget)  రూపాయాల బడ్జెట్‌తో నిర్మించారట నిర్మాత సుధాకర్‌చెరుకూరి.

మరి…ది ప్యారడైజ్‌ సినిమాను ఆడియన్స్‌ ఏంత మేరకు హిట్‌ చేస్తారనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu