Nani : నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శౌర్యువ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హాయ్ నాన్న’ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించిన ఈ చిత్రం, క్లాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సక్సెస్ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతోందని గత కొంతకాలంగా ప్రచారం సాగింది.
కానీ, ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఒక షాకింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం నాని కాల్షీట్లు అన్నీ ఫుల్ అయిపోవడంతో, శౌర్యువ్ సినిమా పట్టాలెక్కడం కష్టమని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి రద్దు అయినట్లు సమాచారం. నాని ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమాలు పూర్తి చేస్తున్న హీరోలలో ఒకరు. ఆయన లైనప్ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఎందుకు ఆగిపోయిందో అర్థమవుతుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత స్టైలిష్ డైరెక్టర్ సుజిత్‌తో సినిమా చేయాల్సి ఉంది. వరుసగా ఇన్ని పెద్ద సినిమాలు లైన్‌లో ఉండటంతో, శౌర్యువ్ సినిమాకు డేట్స్ కేటాయించడం నానికి సాధ్యపడటం లేదట.
అందుకే పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. నిజానికి ‘హాయ్ నాన్న’ వంటి ఎమోషనల్ సినిమా తర్వాత, నాని కోసం శౌర్యువ్ ఒక భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను సిద్ధం చేశారు. తన మార్క్ క్లాస్ టచ్‌తోనే మాస్ ఎలిమెంట్స్ జోడించి ఈ కథను రాసుకున్నారట. కానీ ఇప్పుడు నాని తప్పుకోవడంతో, శౌర్యువ్ ఈ పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను మరో హీరో వద్దకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ‘హాయ్ నాన్న’ వంటి క్లాసిక్ తర్వాత ఈ కాంబో రిపీట్ అవుతుందని ఆశించిన అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే అయినప్పటికీ, నాని ఎంచుకున్న మిగతా ప్రాజెక్టులు కూడా భారీ ఎత్తున ఉండటం విశేషం. మరి డైరెక్టర్ నాని ప్లేస్ లో ఏ హీరోని సెలెక్ట్ చేస్తాడో చూడాలి.
Для успешного вывода из запоя используется комплексный подход с участием специалистов разных профилей. Более подробно об этом можно узнать на официальном портале наркологической службы.
Подробнее можно узнать тут – анонимный вывод из запоя в нижнем тагиле