బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ కన్నుమూత

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
1 Min Read
Bollywood actor NanaPatekar Died

Web Stories

NanaPatekar Died: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నానా పటేకర్‌ (Actor NanaPatekar)ఇక లేరు. గురువారం ఉదయం గోవాలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఇంట్లో అపస్మారకస్థితిలో ఉన్న నానా పటేకర్‌ను ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, నానా పటేకర్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దాదాపు 45 నిమిషాల పాటుగా, ఆయనకు సీపీఆర్‌ చేసినప్పటికీని, ఉపయోగం లేకపోయిందని, వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ‘పరిందా’, ‘ఖామోషి’, ‘తిరంగా’, ‘అగ్నిసాక్షి’, ‘నట సామ్రాట్‌’, ‘అబ్‌ తక్‌ చప్పన్‌’, ‘అపహరణ్‌’, ‘శక్తి: ది పవర్‌’, ‘రాజ్నీతి’…వంటి చిత్రాల్లో నానా పటేకర్‌ నటన ప్రేక్షకులను మెప్పించింది.

ఇక నటుడిగా నాన పటేకర్‌ అద్భుతమైన కెరీర్‌ ఉంది. నానా పటేకర్‌ అసలు పేరు విశ్వనాథ్‌ పటేకర్‌. 1951లో జన్మించిన ఆయన, 1978లో వచ్చన ‘గమన్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ముఖ్యంగా హిందీ, మరాఠి భాషల్లో చాలా సినిమాలు చేశారు.

1989లో వచ్చిన హిందీ థ్రిల్లర్‌ సినిమా ‘పరిందా’లోని నటనకు గానూ ఆయనకూ తొలిసారి జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత ఇదే విభాగంలో సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ‘అగ్నిసాక్షి’ చిత్రానికిగానూ మరో జాతీయ అవార్డు ఆయన్ను వరించింది. 1994లో వచ్చిన యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘క్రాంతివీర్‌’ చిత్రంలోని అద్భుత నటనకు నానాపటేకర్‌కు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. పలు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు కూడా వరించాయి. ఇక హీరో, సపోర్టింగ్‌ యాక్టర్, విలన్‌…ఇలా ఈ మూడు విభాగాల్లో ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు అందుకున్న వ్యక్తి నానా పటేకర్‌. ఇర్ఫాన్‌ఖాన్‌ తర్వాత ఈ ఘనతను సాధించింది నానా పటేకర్‌నే. అలాగే 2013లో భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. అదే ఏడాది మహారాష్ట్ర ప్రభుత్వం రాజ్‌కపూర్‌ స్పెషల్‌ కాంట్రిబ్యూషన్‌ అవార్డుతో సత్కరించింది.

 

 

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu