ధనుస్‌-సాయిపల్లవి ‘ఓ.మ్‌’ సినిమా రివ్యూ…ఆపరేషన్‌ మోల్‌ సక్సెస్‌ అయ్యిందా?

SPM
SPM
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
4 Min Read

Web Stories

‘అమరన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వంలో రూపొ ందిన ‘ఓ.మ్‌ (ఆపరేషన్‌ మోల్‌)’ (O.M Operation Mole Review)  సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. పైగా, ఈ సినిమాలో ధనుష్, మమ్ముట్టీ, సాయిపల్లవి, శ్రీలీల...వంటి ప్రముఖ తారాలు భాగం అయిన నేపథ్యంలో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. మరి..ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో సఫలం అయ్యిందా? అనేది రివ్యూలో (O.M Operation Mole Movie Review) చూద్దాం.

సినిమా ఓ.ఎమ్‌ (ఆపరేషన్‌ మోల్‌)
ప్రధాన నటీనటులు ధనుష్, మమ్ముట్టీ, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్‌ షా, రేణుదేశాయ్, చైతన్య రావు, కలైరాణి, ఇంద్రన్స్‌
దర్శకత్వం రాజ్‌కుమార్‌ పెరియసామి
నిర్మాతలు ధనుష్, శ్రద్ధా అగర్వాల్, అజ్మత్‌ జగ్మాగ్‌
సంగీతం సాయి అభ్యంకర్‌
కెమెరా కె అజిల్‌ అరసు
ఎడిటింగ్‌ కలైవాణన్‌
నిడివి 2 గంటల 58 నిమిషాలు
విడుదల తేదీ 20–11–2026
రేటింగ్‌ 2.25/5

కథ

తమిళనాడు–ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో 2010 నుంచి 2016 మధ్య కాలంలో జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంతో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ అక్రమ రవాణా అధినేత, దుబాల్‌లో నివాసం ఉండే అబ్దుల్‌ హమీద్‌ (నసీ రుద్దీన్‌ షా), నెట్‌వర్క్‌లోని కీలక వ్యక్తి బర్మా కార్తీకేయన్‌ ఆలియాస్‌ సియా (మమ్ముట్టీ)ను అరెస్ట్‌ చేయాలనే లక్ష్యంతో నిత్యారెడ్డి (సాయిపల్లవి) నేతృత్వంలో పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ ఓ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తుంది. నిత్యారెడ్డికి హెల్ప్‌చేసే సీక్రెట్‌ ఏజెంట్‌గా తిరుకుమారన్‌ పేరుతో అండర్‌కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కార్తీకేయన్‌ గ్యాంగ్‌లో చేరతాడు పళనివేల్‌ (ధనుష్‌). దాదాపు 700 టున్నుల విలువైన ఎర్రచందనంను ట్రాన్స్‌ఫోర్ట్‌ చేసే సమయంలో జరిగిన ఓ ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 20మంది కూలీలు చనిపోతారు. అయితే ఆ రూ. 700 టన్నుల విలువైన ఎర్రచందనం సరుకును రీప్లేస్ చేయాలని కార్తీకేయన్‌కు అబ్దుల్‌ హమీద్‌ ఆర్డర్‌ వేస్తాడు. మరి..ఆ తర్వాత ఏం జరిగింది? దుబాయ్‌ నుంచి అబ్దుల్‌ హమీద్‌ ఎందుకు బయటకు వచ్చాడు? ఆపరేషన్‌ మోల్‌ అంటే ఏమిటి? ఇందులో రాజకీయ నాయకుడు గోవర్థన్‌ పాత్ర ఎంతమేరకు ఉంది? నిత్యారెడ్డికి జరిగిన అన్యాయం ఏమిటి? అన్నది మిగిలిన కథ (O.M Operation Mole  Review).

విశ్లేషణ

ఎర్రచందనం అక్రమ రవాణా అనగానే…చాలామంది తెలుగు ఆడియన్స్‌కు అల్లు అర్జున్‌ ‘పుష్ప’, కొంత మందికి రవితేజ ‘ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ’ సినిమాలు గుర్తుకు రావొచ్చు. కానీ ‘ఓ.మ్‌’ (ఆపరేషన్‌ మోల్‌) సినిమాను ఓ డిఫరెంట్‌ వేలో డీల్‌ చేశారు దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామి. ఎర్రచందనం నెట్‌వర్క్‌ వ్యవస్థను హైలైట్‌ చేయకుండ, కూలీల బ్యాక్‌డ్రాప్, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ వంటి అంశాలను ఈ సినిమాలో ప్రస్తావిస్తూ, ఓ సీక్రెట్‌ స్టింగ్‌ ఆపరేషన్‌ మిక్స్‌ చేశారు. కానీ స్క్రిప్ట్‌లో ఈ అంశాలను బ్లెండ్‌ చేస్తూ, కథను బ్యాలెన్స్‌ సఫలం కాలేకపోయారు రాజ్‌కుమార్‌.

కార్తీకేయన్‌ గ్యాంగ్‌లోకి హీరో ఈజీగా ఎంటర్‌కావడం, తక్కువ సమయంలోనే కార్తీకేయన్‌కు తిరు రైట్‌ హ్యాండ్‌గా మారడం…వంటి సన్నివేశాలు రోటీన్‌గా అనిపించాయి. తన దగ్గర రికార్డింగ్, సాక్ష్యాలు ఉన్న ప్పుడు నిత్యారెడ్డి అసలైన లోకల్‌ నెట్‌వర్క్‌ను అరెస్ట్‌ చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఇక గవర్నమెంట్‌ సపోర్ట్‌తోనే 300 టన్నుల ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరగడం అనే పాయింట్‌ బాగోలేదు. ఇక సెకండాఫ్‌లో ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ జరగే చాన్స్‌ ఉందని తెలిసి కూడా హీరో కూలీలను అడవికి తీసుకువెళ్లడం అన్నది కరెక్ట్‌గా అనిపించదు.

ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఆల్రెడీ జైలులో చాలామంది కూలీలు మగ్గుతున్నప్పుడు, మరికొంతమంది కూలీలు జైలుకు వెళ్లడానికి హీరో కార ణం కావడంలో అర్థం లేదనిపిస్తోంది. ఈ ప్రకారం…కూలీలకు ఏదో అన్యాయం జరుగు తుందని హీరో ఫీల్‌ కావడంలో అర్థం లేదనిపిస్తోంది. నిత్యారెడ్డి పాత్రను ఎండ్‌ చేసిన విధానం బాగోలేదు. సినిమా చివర్లో తక్కువ వ్యవధిలోనే రెండు భారీ ఫైట్స్‌ ఆడియన్స్‌కు విసుగు తెప్పించవచ్చు. రోజా (శ్రీలీల) ట్రాక్‌ కథ నిడివి పెంచడానికి ఉపయోగపడిందే కానీ, కథకు ఒరిగింది ఏమీ లేదు. ఇక ఇంట్రవెల్‌లో వచ్చే ఓ ట్విస్ట్‌ మాత్రం అదిరిపోతుంది. ఇలాంటి సీక్వెన్స్‌ మరోకటి సెకండాఫ్‌లో కూడా వచ్చీ ఉంటే బాగుండేది. పేలవమైన సెకండాఫ్, సాగదీత సన్నివేశాలు, ఊహింగల స్క్రీన్‌ ప్లే ఈ సినిమాకు మైనస్‌గా నిలిచాయి.

నటీనటులు–సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్‌ (O.M Movie Cast and crew)

పళని అలియాస్‌ తిరుకుమారన్‌ పాత్రలో ధనుష్‌ యాక్టింగ్‌ బాగుంది. తనకున్న అనుభవం ఇలాంటి క్యా రెక్టర్స్‌ సులభంగా చేయగలరు. ఇక ఈ సినిమాకు సెంటర్‌ ఆఫ్‌ ఏట్రాక్షన్‌గా నిలిచిన నిత్యారెడ్డి పాత్రలో సాయిపల్లవి అదరగొట్టారు. మేకోవర్, యాక్షన్‌ సీక్వెన్స్‌ బాగా చేశారు. ఒక కొత్త సాయిపల్లవిని చూస్తారు. బర్మా కార్తీకేయన్‌గా మమ్ముట్టీ, కార్తీకేయన్‌ భార్య అమలగా రేణుదేశాయ్, పళనిభార్యగా రోజాగా శ్రీలీల ..ఇలా బలమైన నటీనటులు ఉన్నా, దర్శకుడు వీరి యాక్టింగ్‌ స్ట్రెంత్స్‌ను సరిగా వాడుకోలేదనే అనిపిం చింది. విలన్స్‌ గోవర్ధన్‌రెడ్డిగా శివాజీ రాజా, మెయిన్‌ విలన్‌ అబ్దుల్‌ అహ్మద్‌గా నసీరుద్ధీన్‌ షా ఒకే. ఇంద్రన్స్‌ పాత్ర ఉన్నది కొంతసేపే అయినా కథకు కీలకంగా ఉంటుంది. సాయిఅభ్యంకర్‌ పాటలు ఓ మోస్తారుగా ఉన్నా, ఆర్‌ఆర్‌ బాగుంటుంది. సినిమా నిడివిని ఇంకాస్త తగ్గించాల్సింది ఎడిటర్‌. విజువల్స్, నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బాటమ్‌లైన్‌: ఆపరేషన్‌ మోల్‌…అక్కడక్కడ ఆసక్తికరం. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా నచ్చుతుంది. కానీ కాస్త ఓపికగా చూడాలి.

 

Please Share
Share This Article
BySPM
ప్రీలాన్స్‌ జర్నలిస్ట్‌గా ఏడాది కాలం అనుభవం ఉంది.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Heroine Sreeleela 2026 Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah