వారణాసి కథ గురించి మరో కట్టుకథ!

Viswa

Web Stories

Vanarasi Movie Story: వారణాసి సినిమాపై భారీ హైప్‌ ఉంది. అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఉంది. ఈ సినిమాను గురించి అంతర్జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. అలాగే ఈ సినిమా స్టోరీని గురించి కూడా ఎప్పటికప్పుడు సరికొత్త ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి (Vanarasi Movie Story).

అయితే ‘వారణాసి’ సినిమా టైమ్‌ట్రావెల్‌ ఫిల్మ్‌ అని, ఓ సినిమాలోని ఓ కీలక సీక్వెన్స్‌ భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తీశారని, ఈ 30 నిమిషాల సీక్వెన్స్‌లో రాముడు పాత్రలో మహేశ్‌బాబు కనిపిస్తారని ఆల్రెడీ మేకర్స్‌ ప్రకటించారు. ‘వారణాసి’ సినిమాను 7 ఏప్రిల్‌ 2027న (Varanasi Movie Release date) రిలీజ్‌ చేయనున్నట్లుగా కూడా తెలిపారు.

ఇప్పు డు ‘వారణాసి’ సినిమా కథపై మరో కొత్త పుకారు,ఊహాగానం తెరపైకి వచ్చింది. ‘వారణాసి’ సినిమా లోగోను గమనించిన ట్లయితే, ఒక పెద్ద గ్రహశకలం భూ గ్రహాన్ని
ఢీ కొనబోతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఈ భారీ విపత్తు నుంచి, ప్రజలను, ప్రపంచాన్ని రుద్ర ఎలా కాపాడతాడు? ఈ భారీ ప్రమాదానికి గల పరిష్కారం మన పురణాల నుంచి ఎలా కను క్కుంటాడు? ఈ క్రమంలో వారణాసి నగరంలో ఏటువంటి పరిస్థితులు నెలకొంటాయి? మణి కర్ణిక ఘాట్‌లో రుద్ర ఏటువంటి సాహసాలు చేస్తారు? అన్న కోణంలో ఈ సినిమా కథనం సాగు తుందనే టాక్‌ వినిపిస్తోంది. కానీ…ఇదంతా ఓ ఊహగానమే. స్టోరీని గురించి సరైన క్లారిటీ రావాలంటే, ఈ సినిమా ట్రైలర్‌ వస్తే కానీ, సూఛాయగా ఓ అంచనా ఉండదు. ఎదుకంటే.. రాజమౌళి సినిమా కథనాలు ఓ పట్టాన ఆడియన్స్‌ ఊహించలేరు. వారణాసి సినిమాకు కంచి, విజయేంద్రప్రసాద్‌లు కథ అందిస్తున్నారు. దేవకట్టా ఓ డైలాగ్‌ రైటర్‌గా పనిచేస్తున్నారు.

ఈ సినిమా కు గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే… భూగోళంలోని ఏడు ఖండాలను కాలాతీతంగా ప్రయాణం చేయగల సాహసీకుడు రుద్ర పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నాడు. కథ కూడా ఇలాగే ఉంటుందని తెలుస్తోంది. ఏడు ఖండాల్లోని ఏ ప్రాంతాలకైనా కాలానికి అతీతంగా మహేష్ బాబు ప్రయాణం చేయగలడు అది 1000ఏళ్ళ అయినా, 5000 ఏళ్ళ అయినా సరే. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వారణాసి సినిమా కథను సాగుతుందని ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ జార్జియాలో ప్లాన్‌ చేశారని తెలిసింది. ఈ తర్వాత అంటార్కిటికా, ఆఫ్రికా లోకేషన్స్‌లో కూడా ‘వారణాసి’ సినిమా చిత్రీకరణ జరుగుతుంది.

ఇక ఈ సినిమాలో రుద్ర పాత్రలో మహేశ్‌బాబు, ప్రపంచాన్నే హస్తగతం చేసుకోవాలనుకునే కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌సుకుమారన్, మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ఎస్‌.ఎస్‌. కార్తికేయ, కేఎల్‌. నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎమ్‌ఎమ్‌కీరవాణి ఈ ‘వారణాసి’ సినిమాకు సంగీత దర్శకుడు (Varanasi Movie cast and crew).

Please Share
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Krithishetty Ritika Nayak disha patani latest Photo Shoot photos Meenakshi Chaudhary Suriya46 movie opening photos