రెండుపార్టులుగా వారణాసి.. క్లారిటీ ఇచ్చినా రాజమౌళి

Viswa
2 Min Read

Web Stories

Varanasi Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న ‘వార ణాసి’ సినిమాపై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు రాజమౌళి. ‘వారణాసి’ సినిమా రెండు పార్టులుగా విడుదల కానుందనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. ‘వారణాసి’ సినిమాను తొలుత రెండు పార్టులుగా విడుదల చేయాల నుకున్నప్పటికీని, ఈ ఐడియాను ఆ తర్వాత డ్రాప్‌ చేశామని రాజమౌళి చెప్పారు. ‘వారణాసి’ సినిమా మూడుగంటల నిడివితో సింగిల్‌ పార్టుగానే రిలీజ్‌ అవుతుందని రాజమౌళి తెలిపారు (Rajamouli upcoming film Varanasi).

ఇంకా ‘వారణాసి’ సినిమాను గురించి చెబుతూ, ‘వారణాసి’ సినిమాలో మైథలాజీ ఎపిసోడ్‌ 25నిమిషాల పాటు ఉంటుందని ఆయన వెల్లడించారు. ‘వారణాసి’ సినిమాలోని కీలక సన్నివేశాలు అంటార్కిటికా లోకేషన్స్‌ చిత్రీకరించనున్నట్లుగా తెలిపారు. అంటార్కిటికా సన్నివేశాలు, సినిమాలోని మైథాలజీ ఎపిసోడ్స్‌ విజువల్స్‌ను గుర్తుపెట్టుకుని, ఐమ్యాక్స్‌ వెర్షన్‌లో ‘వారణాసి’ సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా రాజమౌళి పేర్కొన్నారు. ఇంకా ‘వారణాసి’ సినిమా టీజర్‌ కోసమే ఏడాది సమయం వెచ్చించామని, ఈ టీజర్‌ కోసం ఏఐ వాడలేదని, అలా ఏఐ వాడి, ఆర్టిస్టు బ్రిలియన్స్‌ను తక్కువ చేసి చూడలేనని అన్నారు. హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌కామెరూన్‌తో పోల్చడం తగదని, ఆయన గొప్ప దర్శకుడని రాజమౌళి చెప్పారు (Varanasi movie two parts).

MaheshBabu Says He Trained three monthes in Marshal arts for Varanasi Movie
MaheshBabu Says He Trained three monthes in Marshal arts for Varanasi Movie

ఇక ‘వారణాసి’ సినిమా గురించి ఈ చిత్రం హీరో మహేశ్‌బాబు కూడ కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్‌ చేశారు. ‘వారణాసి’ సినిమాలో తాను రుద్ర, రాముడు..ఇలా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నట్లుగా మహేశ్‌బాబు తెలిపారు. తన రోల్‌ కోసం దాదాపు మూడు నెలల పాటుగా ప్రత్యేకశిక్షణ తీసుకున్నానని, మార్షల్‌ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందానని మహేశ్‌బాబు పేర్కొన్నారు (Telugu cinema updates).

కాలానికి అతీతంగా భూగోళంపై ఏడు ఖండాల్లో ఏక్కడికైన ప్రయాణం చేయగలిగే రుద్ర పాత్రలో మహేశ్‌బాబు యాక్ట్‌ చేస్తున్నారు. మహేశ్‌బాబు ఈ సినిమాలో శివభక్తుడు రుద్ర పాత్రలో కనిపిస్తారు. మిస్టీరియస్‌ థెప్ట్‌ మందాకిని పాత్రలో ప్రియాంకా చోప్రా, ప్రపంచాన్ని ఎలాలనే క్రూయల్‌ థాట్స్‌ ఉన్న కుంభ పాత్రలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌ నటిస్తారు. ప్రకాష్‌రాజ్‌ మరో కీ రోల్‌ చేస్తున్నారు. ‘వారణాసి’ సినిమా ఏప్రిల్‌ 7, 2027న థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

Please Share
Share This Article
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu