‘వారణాసి’ ఓటీటీ డీల్ క్లోజ్.. అన్ని వందల కొట్లా?

Kumar NA
1 Min Read

Web Stories

Varanasi Movie Ott: ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కలయికలో రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ సినిమా ott బిజినెస్ పరంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ హక్కులకు సంబంధించి వినిపిస్తున్న ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్, ‘వారణాసి’ డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా రూ. 650 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం.

భారతీయ సినిమా చరిత్రలో ఒకే ఒక్క చిత్రానికి ఈ స్థాయి ధర పలకడం ఇదే తొలిసారి. ఈ భారీ ఆఫర్‌తో పాటు మేకర్స్ ఒక కీలక నిబంధనను కూడా నెట్‌ఫ్లిక్స్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. సాధారణంగా సినిమాలు విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. కానీ రాజమౌళి మార్క్ సినిమాలకు థియేటర్లలో ఉండే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కనీసం 8 నుండి 12 వారాల (రెండు నుండి మూడు నెలలు) వరకు ఓటీటీ స్ట్రీమింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గతంలో ‘RRR’ నెట్‌ఫ్లిక్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయడంతో, మహేశ్ బాబు సినిమాపై కూడా అదే స్థాయి నమ్మకంతో నెట్‌ఫ్లిక్స్ ఇంతటి భారీ మొత్తాన్ని వెచ్చించేందుకు సిద్ధమైంది.

కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే సినిమా నిర్మాణ వ్యయంలో దాదాపు సగం రికవరీ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి ఇంతటి క్రేజ్ రావడానికి మరో ముఖ్య కారణం ఇందులో ఉన్న భారీ స్టార్ కాస్టింగ్. మహేశ్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ మూవీ, ఇప్పటి నుండే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. అయితే, నిర్మాతలు ఇంకా పెద్ద డీల్ ఆశిస్తుండటంతో చర్చలు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది.

Please Share
Share This Article
5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu