విదేశాల్లో వారణాసి షూటింగ్‌ …ఎక్కడో తెలుసా..?

Viswa
1 Min Read

Web Stories

MaheshBabu Varanasi Shoot: మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వారణాసి’. ఈ సినిమా కొత్త షూటింగ్‌ షెడ్యూల్‌ కోసం మహేశ్‌బాబు జార్జియా వెళ్లారు. అక్కడ కొన్ని భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌లతో పాటుగా, సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. దాదాపు రెండు వారాల పాటు జర్జియా షూట్‌ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాలోని ప్రదాన తారాగణం అయిన ప్రియాంకా చోప్రా, ప్రుధ్వీరాజ్‌సుకుమారన్‌లు కూడ ఈ భారీ షూట్‌ షెడ్యూల్‌లో జాయిన్‌ కానున్నట్లుగా తెలిసింది.

ఇప్పటికే ‘వారణాసి’ సినిమా షూటింగ్‌ 50శాతానికిపైగా పూర్తయినట్లుగా రాజమౌళి చెప్పారు. ఆ ఏడాదిలోనే ఈ షూట్‌ మొత్తాన్ని పూర్తి చేసేసి, పక్కాగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను చేసుకోవాలని రాజమౌళి అండ్‌ టీమ్‌ ప్లాన్‌ చేసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఫిల్మ్‌ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు రూ. 600 కోట్ల రూపాయాల ఓటీటీ డిజిటల్‌ కన్ఫార్మ్‌ అయ్యిందనే వార్తలు ఉన్నాయి. ‘వారణాసి’ సినిమాను దాదాపు రూ. 1400 కోట్ల రూపాయాల బడ్జెట్‌తో నిర్మిస్తు న్నారని తెలిసింది.

రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 7న థియేటర్స్‌లో సింగిల్‌ పార్ట్‌ మూవీగా రిలీజ్‌ కానుంది. రాజమౌళి సినిమాలు ఇప్పటివరకు తొలుత చెప్పిన డేట్‌కే విడుదల కాలేదు. దీంతో ‘వారణాసి’ సినిమాలో ఇది జరుగుతుందా? లేదా? అనే ఒకరకమైన టెన్షన్‌ మాత్రం మహేశ్‌బాబుఫ్యాన్స్‌లో కనిపిస్తుంది. తెలుగు పండగలు, వీకెండ్‌లు కలిసి వచ్చేలా ఉండటంతో, ఏట్టిపరిస్థితుల్లోనూ, ఏప్రిల్‌ 7, 2027నే ‘వారణాసి’ సినిమాను రిలీజ్‌ చేయాలని టీమ్‌ బలంగా ప్లాన్‌ చేస్తుందని తెలిసింది.

Please Share
Share This Article
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu Shivani Nagaram Manasa Varanasi