అమ్మా…ఏమైపోయావమ్మ…

Viswa
1 Min Read
Nayanthara Mahasakthi News

Web Stories

Mahasakthi Movie: నయనతార కెరీర్‌లో ‘ముక్కుత్తి అమ్మన్‌’ (తెలుగులో ‘అమ్మోరు తల్లి’) సినిమా మంచి హిట్‌ సినిమా. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ముక్కుత్తి అమ్మన్‌ 2’ రూపొందింది. తెలుగులో మహాశక్తి అనే టైటిల్‌ పెట్టారు. కాక పోతే ‘అమ్మోరు తల్లి’ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించగా, ‘మహాశక్తి’ (Mahasakthi Movie) సిని మాకు మాత్రం సుందర్‌.సి దర్శకత్వం వహించారు. వేల్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం దీపావళి సంద ర్భంగా నవంబరు 6న విడుదల కానుంది. తాజాగా ‘మహాశక్తి’ సినిమా ఇలా ఉండబోతుందని తెలిసేలా, ఓ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 

నయనతార (Nayanthara) ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా ఉంటుంది. కాస్త భయస్తురాలు. అలాంటి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ ఓ పెద్ద దుష్టశక్తిని ఎలా ఎదుర్కొంది? అమ్మవారి సాయంతో ఏం చేసింది? అన్న అంశాల నేపథ్యంతో ‘మహాశక్తి’ సినిమా కథనం సాగుతున్నట్లుగా తెలుస్తోంది. మహాశక్తి గ్లింప్స్‌లో….‘ఇంకో మూడు రోజుల్లో రెండు మహాశక్తులు ఢీకొనబోతున్నాయి’. ‘ఇక్కడ ఇంకేదో శక్తి ఉంది’, ‘అమ్మా…ఏమైపోయావమ్మ.’ అన్న డైలాగ్స్‌ ఉన్నాయి. రెజీనా, ఊర్వశి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఖుష్భూ గెస్ట్‌ రోల్‌ చేస్తారనే ప్రచారం సాగుతోంది. రెజీనా విలన్‌ రోల్‌ చేశారు. విజువల్స్, మేకింగ్‌ చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. కమర్షియల్‌ అంశాలను కూడా పెట్టినట్లున్నారు సుందర్‌. సి. మరి..ఈ సినిమా ఎతంటి విజయం సాధిస్తుందో చూడాలి.

 

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu