Aadi Saikumar Aadi Rudrra Movie: శంభాల సినిమాతో కెరీర్లో మంచి హిట్ అందుకున్నారు హీరో ఆదిసాయికుమార్. ఈ హిట్ ఇచ్చిన ఉత్సా హంతో మరోసారి ఇదే జానర్లో అంటే దైవిక అంశాలతో కూడిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘ఆది రుద్ర’ (Aadi Rudrra Movie) చిత్రా నికి ఆది సాయికుమార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 1960–1990 మధ్య కాలంలో ఈ సినిమా కథనం సాగుతుంది. దసరా ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాకు నవరసన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో పాటుగా, దర్శకత్వం వహించనున్నారు. ప్రశాంత్ జి.రుద్రప్ప ఈ సినిమాకు నిర్మాత. వచ్చే జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ‘‘దైవత్వం, విశ్వాసం, ఆథ్యాత్మిక, రహస్యాలు..వంటి అంశాలు ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా కథనం సాగుతుంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది.