Aadarsha Kutumbam New Release date: వెంకటేశ్ ‘ఆదర్శకుటుంబం’ (Aadarsha Kutumbam Cinema) సినిమా విడుదల తేదీపై కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొని ఉంటుంది. ‘ఆదర్శకుటుంబం’ సినిమాను తొలుత అక్టోబరు 2న రిలీజ్‌కు ప్లాన్ చేశారు. ఆ తర్వాత అక్టోబరు 9న రిలీజ్ అన్నారు. కానీ అక్టోబరు 9న కూడా ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు అక్టోబరు 30న ‘ఆదర్శ కుటుం బం’ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రంయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ తేదీకైనా ఈ సినిమా వస్తుందా? లేదా? అనేది చూడాలి. సినిమా యూనిట్ ప్రమోషన్ యాక్టివి టీస్ను చూస్తుంటే, ‘ఆదర్శ కుటుంబం’ సినిమా అక్టోబరు 30నే విడుదల అయ్యేలా కనిపిస్తోంది.
శ్రీనిధిశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదాపేతురాజ్, యువినా, రాజ్ ప్రజ్వల్, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. పైకి క్లాస్‌గా కనిపించే ఓ ఫ్యామిలీ… అనుకోకుండ ఓ క్రైమ్‌లో చిక్కుకున్నప్పుడు ఏలాంటి పనులు చేసింది అన్నదే ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. డార్క్ కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఈ చిత్రంలో ప్రధానాంశాలుగా ఉంటాయని తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాక్రిష్ణ ఈ సినిమాను నిర్మించారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.