ట్విస్ట్‌లు ఊహించలేరు – నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి

PR
PR
1 Min Read

Web Stories

TheRedbag Movie: కబీర్‌సింగ్‌, ప్రసాద్‌ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్‌, ఆకాంక్ష, ఈషాన్‌శంకర్‌, అవినాష్‌ బాదల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన డిఫరెంట్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా ‘ది రెడ్‌ బ్యాగ్‌’ (TheRedbag Movie). రవికుమార్‌ సీరపు దర్శకత్వంలో మెమరీ మేకర్స్‌ పతాకంపై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. కాగా, ఈ సినిమా ఈ నెల 21న  (TheRedbagMovie Release date)థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రం నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి (Producer Harikrishna Somishetti)  మాట్లాడుతూ-”మా ‘రెడ్‌ బ్యాగ్‌’ చిత్రానికి మంచి హైప్‌ ఏర్పడింది. ఇప్పటివరకు రిలీజ్‌ చేసిన ప్రమోషనల్‌ కంటెంట్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు ఆడియన్స్‌ చూసిన కంటెంట్‌ కంటే, సినిమాలో పది రెట్లు ఎక్కుగా ఇంపాక్ట్‌ ఉంది. ఈ సినిమాలోని ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఊహించలేరు. ఈ సినిమా కథనం చివరి వరకు ఉత్కంఠగా సాగుతూనే ఉంటుంది. పీవీఆర్‌ ఐనాక్స్‌ వారి అద్భుతమైన సపోర్ట్‌తో, ఈ సినిమాను ఎక్కువ స్క్రీన్స్‌లో రిలీజ్‌ చేయనున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ సినిమా ఉంటుంది” అని తెలిపారు.

Please Share
Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Samantha Photos 2026 Aishwarya Rajesh ViRoshWedding 2026 Photos Faria Abdullah Samantha Ruth Prabhu